English | Telugu
వసుధారకి బస్తీవాసులు ఎదురుతిరగడంతో అడ్డుకున్న రిషి!
Updated : Jul 27, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -825 లో.. శైలేంద్ర మీటింగ్ కి పిలవకుండానే వచ్చింది కాకుండ మీటింగ్ డిస్టబ్ చేసేలా అన్ని ప్రశ్నలు వేస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్పమని అడుగుతాడు. మీరు కూడా అడగండి డాడ్ అని ఫణింద్రకి చెప్తాడు. అసలు తప్పు చేసింది అంతా నువ్వే జగతి అసలు.. వీడు లోపలికి వచ్చినప్పుడే బయటకు పంపించాల్సింది. ఇలా మీటింగ్ డిస్టబ్ అయ్యేది కాదు వెళ్ళు ఇక్కడ నుండి అని శైలేంద్రని ఫణీంద్ర బయటకు పంపిస్తాడు.
ఆ తర్వాత మీరు మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఏ నిర్ణయమైనా తీసుకోండి. మీకు ఎవరు అడ్డు చెప్పరు. ఎవరికి బాధ్యతలు ఇస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్పాలి అనిపించినప్పుడు చెప్పండని జగతి, మహేంద్రలతో ఫణీంద్ర అంటాడు. మరొక వైపు ఏంజెల్ ని వసుధార తీసుకొని వెళ్తుంది. వాళ్ళని ఫాలో అవుతూ కాలేజీ బాయ్ వెళ్తాడు. రిషి, వసుధార లకి సంబంధించిన ఏ విషయం అయిన నాకు అప్డేట్ ఇవ్వమని కాలేజీ బాయ్ కి కొంత డబ్బు శైలేంద్ర ఇస్తాడు. అందుకే కాలేజీ బాయ్ వసుధార వాళ్ళని ఫాలో అవుతాడు. మరొకవైపు వసుధార, ఏంజెల్ ఎక్కడికి వెళ్లారని విశ్వనాథ్ ని రిషి అడుగుతాడు. వాళ్ళ గురించి ఏం టెన్షన్ పడకు వసుధార ఎంత తెలివైన అమ్మాయని నీకు తెలుసు కదా అని విశ్వనాథ్ అంటాడు.
తెలుసు కానీ నాకు చేసిన మోసం కూడా తెలుసని రిషి అనుకుంటాడు. మరొక వైపు బస్తీలో పిల్లలకి మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడానికి ఏంజెల్ ని వసుధార తీసుకొని వస్తుంది. అక్కడున్న పిల్లలతో మిషన్ ఎడ్యుకేషన్ గురించి వసుధార మాట్లాడుతుంది. ఆ మాటలు కాలేజీ బాయ్ విని శైలేంద్రకి కాల్ చేసి చెప్తాడు. వసుధర ప్లాన్ ఫెయిల్ అవ్వాలి. బస్తీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్లకు ఏం చెప్తావో నాకు అనవసరం.. ప్లాన్ ఫెయిల్ అవ్వాలని కాలేజీ బాయ్ కి శైలేంద్ర చెప్తాడు. తర్వాత కాలేజీ బాయ్ వెళ్లి బస్తీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వసుధారకి ఎదురు మాట్లాడేలా చేస్తాడు.
ఆ తర్వాత అక్కడ ఉన్న బస్తిలోని పిల్లల తల్లిదండ్రులతో వసుధార మాట్లాడుతుంది. పిల్లలని స్కూల్ కి పంపించండని అడుగుతుంది... కానీ వాళ్ళు వసుధారని అవమానిస్తారు. వాళ్ళు వచ్చిన కార్ టైర్ గాలి తీసేస్తారు. అక్కడున్న వాళ్ళు చెయ్ చేసుకోబోతుంటే వసుధార ఆపుతుంది. అప్పుడే ఆగండని రిషి, పాండియన్ వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఏంటి మేడమ్? ఎందుకు గొడవ పడుతున్నారు. అసలు మీకు బుద్ధి ఉందా అని వసుధారతో రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.