English | Telugu

ట్రెండింగ్ లో షణ్ముఖ్ జస్వంత్ టేల్స్ ఆఫ్ స్టుడెంట్ ఫస్ట్ గ్లింప్స్!

షణ్ముఖ్ జస్వంత్.. యూట్యూబర్. " వైవా" షార్ట్‌ ఫిల్మ్ ద్వారా మొదటి సారే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత "వైవా న్యూస్" తో మరోసారి ఫన్ ని క్రియేట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉన్నాడు‌. ఆ తర్వాత అతను యూట్యూబ్ లో ఒక "ది సాఫ్ట్‌వేర్ డెవలపర్‌"  వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్‌ సిరీస్ లో  "బేబీ" సినిమాలో నటించిన వైష్ణవి చైతన్య చేసింది. ఈ సిరీస్ లో షణ్ముఖ్ ని వైష్ణవి "మిస్టర్ షన్ను" అని పిలవడంతో ఈ పాత్ర బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత  "సూర్య" అనే వెబ్ సిరీస్ లో "సూర్య" పాత్రకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు షణ్ముఖ్. ఏప్రిల్ 2023 నాటికి 4.3 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్ లని కలిగి ఉన్నాడు.

కావ్యని పుట్టింటికి తీసుకెళ్ళిన రాజ్.. ధాన్యలక్ష్మిని అవమానించిన స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -155 లో.. కావ్య చాటుగా కూర్చొని  డిజైన్స్ వేస్తూ ఉంటుంది. రాజ్ వచ్చి కావ్య డిజైన్స్ వేస్తుందని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఎందుకు నాకు తెలియకుండా డిజైన్స్ వేస్తున్నావ్.. నాకు తెలియకూడదు అనుకున్నావా? తెలిసినా ఎంకరేజ్ చెయ్యడని చెప్పట్లేదా అని రాజ్ అడుగుతాడు. "అవును మీకు తెలియకూడదని ఇలా చేస్తున్నాను. మీరు డిజైన్స్ విషయంలో టెన్షన్ పడుతున్నారని నేను ఆఫీస్ కి వచ్చాను. నేను డిజైన్స్ వేసి తీసుకొని వస్తే మీరు చింపేసి డస్ట్ బిన్ లో పడేసారు. అవే డిజైన్స్ శృతి తీసుకొని వస్తే బాగున్నాయని మెచ్చుకున్నారు. అందుకే మీకు తెలియకూడదని శిరీష లాగా మారాను" అని కావ్య చెప్తుంది.

లవ్ లేదు.. బొంగు లేదు.. కొవ్వు తగ్గిస్తా అంటున్న అఖిల్ సార్థక్!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ ముందు వరకు ఎవరికి తెలియదనే చెప్పాలి. బిగ్ బాస్ 4 ఎంట్రీతోనే ప్రేక్షకులకు దగ్గరై ఫేమ్  సంపాదించుకున్నడు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు.. 'నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో' అని అన్నట్లుగా ఉండేవాడు అఖిల్. అతని బిహేవియర్ చాలా మందికి నచ్చేది కాదు. అంతేకాకుండా హౌస్ లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్, అభిజిత్ ల పంచాయతీ వీధుల్లో కుళాయిల దగ్గర ఉండే కొట్లాటలాగా ఉండేది. అఖిల్ బిగ్ బాస్-4 రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ ఓటీటీలో కూడా మరోసారి ఎంట్రీ ఇచ్చి.. అందులో కూడా రన్నరప్ గానే నిలిచాడు.

ఢీ షోకి తాగేసి వచ్చిన ఆది... షాకైనా శేఖర్ మాష్టర్

  ఢీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో తీసుకున్న కాన్సెప్ట్స్ చాలా వెరైటీగా మంచి ఫన్నీగా ఒక షార్ట్ స్టోరీని ఒక డాన్స్ రూపంలో  చెప్పినట్టుగా ఉన్నాయి. ఇందులో ముందుగా కింగ్స్ ఆఫ్ కరీంనగర్ వెర్సెస్ వాల్తేరు వారియర్స్ పోటీ పడ్డారు. ఇక ఈ షోకి దీపికా పిల్లి అఖిల్ సార్థక్ ని తీసుకొచ్చింది. "ఎవడీడు" అని ప్రదీప్ అడిగేసరికి "మా బావ" అని చెప్పింది  దీపికా.." ఆ డ్యాన్సింగ్ స్టయిలు, ఆ బాడీ లాంగ్వేజ్ ఏమీ లేకపోయినా బావ అన్నావ్ కాబట్టి " అని ప్రదీప్ అన్నాడు. "ఇంకొకాయన ఏడీ" అని శేఖర్ మాష్టర్ అడిగేసరికి  హైపర్ ఆది మందు బాటిల్ చేతిలో పట్టుకుని తాగుతూ వచ్చాడు.