English | Telugu

షాక్ లో కళ్ళు తిరిగిపడిపోయిన అలేఖ్య.. కృష్ణ, మురారీల మధ్య  పెరిగిన దూరం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-220 లో.. సన్మానం నుండి బయటకు వెళ్ళిపోయిన కృష్ణ అప్పడే ఇంటికి వస్తాడు. అక్కడ హాల్లో అందరు మురారి కోసం ఎదురుచూస్తుంటారు. రాగానే ఎక్కడికి వెళ్ళావ్ మురారి అని భవాని అడుగగా.. అర్జెంట్ కాల్ వచ్చిందని మురారి చెప్తాడు. అది విన్న ముకుంద.. అంత అర్జెంట్ ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏమైన గొడవలు ఉన్నాయా? అంత అవసరమేంటి? మీ గొడవలని ఇలా బయటపెట్టుకోవడమెందుకని మురారితో అంటుంది. అప్పటికే మురారిలి డౌట్ వస్తుంది. కానీ అవన్నీ నీకెందుకు ముకుంద అని కవర్ చేయాలని చూస్తుంది.

కానీ భవాని గ్రహించి.. ముకుంద కరెక్ట్ గానే అడిగింది వాళ్ళ మధ్య ఏదో ఉంది. గొడవలేమైనా ఉన్నాయా? అసలు మీరిద్దరు బాగానే ఉంటున్నారా అని మురారిని భవాని అడుగుతుంది. అదేం లేదు పెద్దమ్మ కాల్ వస్తే, ఆ టెన్షన్ లో వెళ్ళిపోయానని మురారి అంటాడు. నాకు అబద్ధం చెప్పకు మురారి నేను సహించనని భవాని అంటుంది. దయచేసి వదిలేయండి పెద్దఅత్తయ్య అని భవానీతో కృష్ణ అంటుంది. ‌నిజం చెప్పమని మురారిని భవాని బలవంతం చేస్తుంది. మురారి మౌనంగా ఉంటాడు. "ఏసీపీ‌ సర్ అలసిపోయి వచ్చినట్టున్నాడు.

ఇక ఈ విషయాన్ని వదిలేయండి" అని భవానితో కృష్ణ అనగానే.. సర్లే వెళ్ళమని భవాని అంటుంది . దాంతో మురారి తన గదిలోకి వెళ్తాడు. ఆ తర్వాత అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. మధు, అలేఖ్య ఇద్దరు కృష్ణ, మురారిలు బయట ఎప్పుడు గొడవపడినట్టు కనపడలేదు వాళ్ళ మధ్యలో గొడవలేంటి? అసలెందుకని మురారి సన్మానంలో లేడని మధుతో అలేఖ్య అనగానే.. ముకుంద అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు. వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని అలేఖ్య, మధులతో ముకుంద అంటుంది. అది వినగానే అలేఖ్య షాక్ లో కళ్ళు తిరిగి పడిపోతుంది. వీళ్ళిద్దరికి చెప్తే అందరికి తెలిసిపోతుందని ముకుంద అనుకొని వెళ్లిపోతుంది.

ఇక కృష్ణ, మురారి ఇద్దరు గదిలోకి వెళ్ళిన తర్వాత మౌనంగా ఉంటారు. కృష్ణ, మురారి ఇద్దరు ఆలోచిస్తూ బాధపడుతుంటారు. ఒకరికొకరు ఇద్దరు కలలు కంటూ ఒకరి ఫీలింగ్ ఒకరు షేర్ చేసుకుంటున్నట్టు భావిస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.