Read more!

English | Telugu

అలాంటి వీడియోస్ రాత్రి పెడితేనే బాగుంటాయన్న శ్రీసత్య!

శ్రీసత్య.. బిగ్ బాస్ ప్రియులకు సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్-6 లో 'బ్యూటీ క్వీన్' అని  చెప్తారు. మొన్న జరిగిన శ్రీసత్య పుట్టినరోజుని బిగ్ బాస్ ఫెండ్స్ అందరూ కలిసి గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశారు‌. కంటెస్టెంట్స్ దాదాపుగా అందరు వచ్చి సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అర్జున్ కళ్యాణ్ తో లవ్ ట్రాక్ నడిపిన శ్రీసత్య.. ఆ తర్వాత రేవంత్, శ్రీహాన్ లతో కలిసి స్నేహమంటూ గ్రూప్ గా ఆడింది. హౌస్ లో ఫ్యామిలీ వీక్ ముందు వరకు శ్రీసత్య కచ్చితంగా వెళ్ళిపోతుందనుకున్నారంతా కానీ ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అమ్మనాన్న రావడంతో ఒక్కసారిగా అంచనాలు మారిపోయాయి. తనకున్న నెగెటివ్ టాక్ కాస్త అమ్మ సెంటిమెంట్ తో పాజిటివ్ అయిపోయింది. ఎక్కువ రోజులు ఉన్న శ్రీసత్య ఫైనల్ కి వారం ముందు ఎలిమినేట్ అయి బయటకి వచ్చింది. 

బిబి జోడీ డాన్స్ షోలో శ్రీసత్యతో కలిసి మెహబూబ్ డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే మెహబూబ్ ఈ సెలబ్రేషన్స్ లో తన డ్యాన్స్ స్టెప్స్ తో ఫుల్ జోష్ గా కనిపించాడు. శ్రీసత్య కూడా చిందులు వేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఫుల్ క్రేజ్ లో ఉన్న బ్యూటి శ్రీసత్య. శ్రీసత్య తన తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన వాసంతిని పార్టీ అంటూ ఎప్పుడు కలుస్తూనే ఉంటుంది. బిగ్ బాస్ సీజన్-6 లో  గ్లామర్  క్వీన్ గా బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది వాసంతి.

హౌస్ లో ఉన్నన్ని రోజులు వెనకాల ఉండి ఎక్కువగా గ్రూప్ లతో కలవకుండా ఉన్న వాసంతి.. ఇంకో వారంలో బయటకొస్తుందనే టైమ్ లో ఒక్కొక్కరితే కలవడం ప్రారంభించింది. కానీ అప్పటికే తనకి ఫ్యాన్ బేస్ లేకపోవడం, టాస్క్ లలో, గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడంతో తనకి నామినేషన్లలో ఓటింగ్ లిస్ట్ లో వెనుకబడింది. దాంతో హౌస్ నుండి బయటకొచ్చింది వాసంతి. అయితే బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి.

తాజాగా శ్రీసత్య, వాసంతి కలిసి ఒక డాన్స్ వీడియోని చేశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగ అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇద్దరు కలిసి " సమ్మోహనుడ "  అనే పాటకు డాన్స్ చేసి పోస్ట్ చేశారు. అయితే  వీళ్ళిద్దరితో పాటు గీతు రాయల్ కూడా కలిసింది. అయితే వీళ్ళు చేసిన డ్యాన్స్ ని వాసంతి ఎడిట్ చేసి రాత్రి అప్లోడ్ చేస్తుంటే.. గీతు వచ్చి ఇప్పుడెందుకు రేపు చేద్దామని అంటుంది. అది విని పక్కనే ఉన్న శ్రీసత్య.. అలాంటి వీడియోస్ రాత్రి పెడితేనే బాగుంటాయని అంటుంది. అలా అనగానే గీతుతో పాటు అక్కడున్న వాళ్ళు నవ్వుకున్నారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో శ్రీసత్య, వాసంతి కలిసి చేసిన ఈ డాన్స్ వీడియోని చుసినవాళ్ళంతా సో హాట్ అంటు కామెంట్లు చేస్తున్నారు.