English | Telugu

Jayam serial : సూర్యకి పొంచి ఉన్న ప్రమాదం.. గంగ ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -92 లో.. పారు తనని ఎవరు ఇబ్బంది పెట్టారని సీసీటీవీలో చూస్తుంది. అందులో గంగ మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్లి బయటకు రావడం ఉంటుంది. మాస్క్ లేకుండా పారుకి వాటర్ ఇవ్వడం ఉంటుంది. అది ఎవరని తెలుసుకోడానికి స్నేహాని పిలుస్తుంది పారు. మీ అన్నయ్యని నేను ఇబ్బంది పెట్టానని ఏవతో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టింది.. అది ఎవరో చూడని పారు అడుగుతుంది. గంగని స్నేహ చూసి.. దీంతో పెట్టుకుంది ఏంటి గంగ గురించి చెప్పకూడదని అనుకొని.. నాకు ఆవిడా తెలియదని స్నేహ చెప్తుంది.