English | Telugu

బిగ్ బాస్ సీజన్-9 లో ఇక ఆ ట్రిక్ ఉండదు.. అదేంటంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం పూర్తయింది. ‌ఇక ఈ ఏడో వారంలో హౌస్ లో ఎవరేం తప్పులు చేశారో చెప్తూ వారిని నాగార్జున తిడుతుంటాడు. కంటెస్టెంట్స్ కి హోస్ట్ కి మధ్య యుద్ధం.. ఇది చూడటానికి మేమంతా సిద్ధం అన్నట్టుగా ఆడియన్స్ ఎదురుచూస్తుంటారు.

అయితే నాగార్జున మంచి సాంగ్ కి డ్యాన్స్ చేసి వచ్చేశాడు. అయితే ఈ వారం ఎవరిపై అంత సీరియస్ అవ్వలేదు నాగార్జున. ఎందుకంటే అంతగా పొరపాట్లు ఏం చేయలేదు కంటెస్టెంట్స్. ఇక ప్రతీ శనివారం, ఆదివారం నాగార్జునతో పాటుగా కొంతమంది ఆడియన్స్ వస్తారు. అయితే ఈ సీజన్-9 లో ఏం జరిగిందంటే.. మొదటి వారం ఓ ఆడియన్ అమెరికా నుండి వచ్చినట్టు చెప్పగా, రెండో వారం ఆడియన్ ఒకరు లండన్ నుండి వచ్చానని చెప్పింది. అయితే తను కరెక్ట్ గా లండన్ నుండే వచ్చింది. ఎందుకంటే తనకి ఓ‌ యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. లండన్ కి తను వెళ్తున్న వీడియోస్, అక్కడ తను చేసిన వ్లాగ్స్ కూడా ఉన్నాయి. తన మీద మొదట ట్రోల్స్ వచ్చినా అందరు నిజం తెలుసుకొని వదిలేశారు. అయితే గత వారం ఓ ఆడియన్ తను దుబాయ్ నుండి వచ్చానని చెప్పింది. అయితే తను ఇన్ స్టాగ్రామ్ లో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతు రీల్స్ చేస్తుంటుంది. ఇక తను బిగ్ బాస్ షోకి వచ్చింది. అందులో ఆడియన్ గా వచ్చి .. దుబాయ్ నుండి వచ్చానని చెప్పటంతో .. బిగ్ బాస్ మావపై ఫుల్ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక ఈ ట్రోల్స్ బిగ్ బాస్ దాకా చేరినట్టుగా ఉన్నాయి అందుకే నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో లండన్,అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా లాంటి పేర్లేమీ వినబడలేదు. మరి బిగ్ బాస్ వాడిన ఈ ట్రిక్ ని మానేశాడని మీకు అర్థం అయ్యిందా.. అయితే ఏం అబ్జర్వ్ చేసారో కామెంట్ చేయండి.