English | Telugu

డాక్టర్ ని రిక్వెస్ట్ చేసిన కావ్య.. రాజ్ చూసేసాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -861 లో..... కావ్య అబార్షన్ చేయించుకోవడం లేదని ఇంట్లో వాళ్లంతా తనపై కోపంగా ఉంటారు. కావ్య ప్రసాదం తీసుకొని వస్తుంది.. ఎవరు తీసుకోరు. మేమ్ చెప్పినట్టు వినేవరకు నీతో అసలు మాట్లాడము.. అసలేం తినమని ఇందిరాదేవి చెప్తుంది. అయితే మీ ఇష్టమని కావ్య అక్కడ నుండి వెళ్లిపోతుంటే కళ్ళు తిరిగి కిందకిపడిపోతుంది కావ్య. అది చూసి అందరు కావ్య యాక్టింగ్ చేస్తుందనుకుంటారు.

కావ్య నువ్వు చేసింది చాలులే.. లేవు ఇక అని స్వప్న అంటుంది. అయిన లేవకపోవడంతో దగ్గరికి వెళ్లి చూస్తారు.. అయ్యో కావ్య నిజంగానే పడిపోయిందనగానే అందరు వస్తారు. దాంతో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. డాక్టర్ కావ్యకి ట్రీట్ మెంట్ ఇస్తుంది. కావ్య ఇప్పుడు స్పృహలో లేదు కదా.. ఇప్పుడు అబార్షన్ చేయించి కావ్య ప్రాణాలు కాపాడాలని ఇందిరాదేవి, అపర్ణ కలిసి రాజ్ కి చెప్తారు. అలా చెయ్యడం తప్పని రుద్రాణి అంటుంది. తప్పే నిన్ను ఉండనిచ్చి తప్పు చేశామని రుద్రాణిపై అపర్ణ కోప్పడుతుంది. ఆ తర్వాత కావ్యకి అబార్షన్ చెయ్యండని రాజ్, అపర్ణ, ఇందిరాదేవి చెప్తారు. అలా పేషెంట్ కి తెలియకుండా చెయ్యడం తప్పని డాక్టర్ అంటుంది. అప్పుడే కావ్య రిపోర్ట్స్ నర్సు తీసుకొని వస్తుంది. అవి చూసిన డాక్టర్ రాజ్ దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ రాజ్ ఇన్ని రోజులు అబార్షన్ చెయ్యాలని చెప్పాను కదా.. ఇక అవసరం లేదు బేబీ బాగుందని చెప్తుంది. దాంతో ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఆ తర్వాత కావ్యని ఇంటికి తీసుకొని వస్తారు. ఇక ఇన్ని రోజులు జరిగిందంతా మర్చిపోండి.. మీకు నచ్చినట్లు డాక్టర్ చెప్పింది కదా అని ఇంట్లో వాళ్లతో కావ్య అంటుంది. తరువాయి భాగంలో ఎందుకు ఇలా చేసావ్ కావ్య అని రాజ్ అడుగుతాడు. నువ్వు డాక్టర్ ని రిక్వెస్ట్ చెయ్యడం నేను చూసానని రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.