English | Telugu

Jayam serial : కొత్త అకాడమీ ఓపెన్ చేసిన రుద్ర.. ఛాంపియన్ పై అతను గెలుస్తాడా! 

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -94 లో..... సూర్యని ఇంట్లో నుండి పంపించడానికి రుద్ర ఒప్పుకుంటాడు. సూర్య వెళ్లిపోతుంటే వీరు తన దగ్గరికి వెళ్లి నీకు నిజం తెలియదని బ్రతికించాలనుకున్నాను.. నీకు నిజం తెలిసాక ఆ పని ఎందుకు చేస్తానని సూర్యని కోమాలోకి వెళ్లే ఇంజక్షన్ వేస్తాడు వీరు.

మరొకవైపు రుద్ర అకాడమీ ఓపెన్ చేస్తారు. అప్పుడే గంగ స్వీట్ పట్టుకొని వచ్చి నేను రాకుండానే చేస్తారా అని అందరికి స్వీట్ ఇస్తుంది. రుద్ర స్వీట్ తీసుకోబోతుంటే పారు ఎంట్రీ ఇస్తుంది. ఏ ధైర్యంతో ఇలా అకాడమీ పెట్టుకుంటున్నావ్.. నిన్ను నమ్మి ఇందులో జాయిన్ అవ్వాలా.. ఏమని నేర్పిస్తావ్ మోసం చేసి గెలవాలని నేర్పిస్తావా అని పారు అంటుంది. నువ్వు ఎందుకు వచ్చావని పెద్దసారు మాట్లాడుతాడు. రుద్ర సర్ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని పారుకి గంగ ఎదురుతిరుగుతుంది. అంటే నువ్వేనా నన్ను నిన్న చేయి మెలిక పెట్టి వార్నింగ్ ఇచ్చిందని పారు అనగానే అవునే నేనే రుద్ర సర్ జోలికి వస్తే ఊరుకోమని గంగ వార్నింగ్ ఇస్తుంది. ముందు నువ్వు ఛాంపియన్ అని ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత అకాడమీ మొదలు పెట్టమని పారు అంటుంది.

నేను చెప్పిన అతనితో తలపడు.. గెలువు.. అప్పడే నువ్వు ఛాంపియన్ అవుతావని పారు అనగానే అందుకు కూడా రుద్ర ఒప్పుకుంటాడు. మరొకవైపు రుద్ర గెల్వకుండా చూడాలి గెలిస్తే పూర్వ వైభవం వచ్చి మన ఆటలు సాగవని ఇషికతో వీరు అంటాడు. ఛాలెంజ్ కి రుద్ర ప్రాక్టీస్ చేస్తాడు. ఆ తర్వాత పారు దగ్గరికి గంగ వచ్చి వార్నింగ్ ఇస్తుంది. గెలవబోయేది మా రుద్ర సర్ అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.