English | Telugu
Bigg Boss 9 Telugu: ఏడో వారం కొత్త కెప్టెన్ గా ఇమ్మాన్యుయల్.. పోరాడి ఓడిన తనూజ!
Updated : Oct 25, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం హౌస్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. దొంగల టాస్క్ ముగిసింది. ఇక రమ్య, రాములని డబ్బు లేని కారణంగా కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుండి తొలగించగా.. తనూజ, రీతూలని డైరెక్ట్ కంటెండర్స్ ని చేశారు అంబటి అర్జున్, అమర్ దీప్.
నిన్నటి ఎపిసోడ్ లో అయేషాకి హెల్త్ ప్రాబ్లమ్ ఉందని మెడికల్ రూమ్ కి రమ్మన్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత గేమ్ కంటిన్యూ చేశాడు బిగ్ బాస్. ఇక కెప్టెన్సీ టాస్క్ ముందు మరోసారి అయేషాని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్. తనకి డెంగ్యూ ఫీవర్ అని తన ఆరోగ్యం దృష్ట్యా బయటకు రావాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక అందరికి బై చెప్పేసి అయేషా బయటకి వెళ్లింది. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ రేస్ ని కొనసాగించాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఓ సర్కిల్ లో క్యాప్ ఉంచాడు బిగ్ బాస్. ఎవరైతే ఆ క్యాప్ ని దక్కించుకొని అక్కడ నిల్చున్న మిగతా కంటెస్టెంట్స్ ఆ క్యాప్ ని ధరించి వారు ఎవరిని ఎలిమినేషన్ చేయాలని అనుకుంటున్నారో వారి పేరు చెప్తారు. అలా గేమ్ రూల్స్ చెప్తాడు బిగ్ బాస్. ఇక ఫస్ట్ రౌండ్ లో నిఖిల్ క్యాప్ ని దక్కించుకున్నాడు. అ క్యాప్ ని గౌరవ్ కి పెట్టగా తను కళ్యాణ్ ని టాస్క్ నుండి ఎలిమినేషన్ చేసాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ కి క్యాప్ దక్కింది. ఆ క్యాప్ తీసుకెళ్ళి సంజనకి పెట్టగా తను దివ్య పేరు చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ క్యాప్ ని ఇమ్మాన్యుయల్ దక్కించుకొని మాధురికి ఇవ్వగా తను నిఖిల్ పేరుని చెప్పింది.
ఇక చివరి రౌండ్ లో రీతూ, ఇమ్మాన్యుయల్, తనూజ ఉండగా క్యాప్ ని ఇమ్మాన్యుయల్ దక్కించుకున్నాడు. దానిని మధురికి ఇవ్వగా రీతూని ఎలిమినేషన్ చేసింది. ఇక చివరగా తనూజ, ఇమ్మాన్యుయల్ ఉండగా క్యాప్ ఇమ్మాన్యుయల్ కి దక్కింది. అది సంజనకి ఇవ్వగా తనూజని తను ఎలిమినేషన్ చేసింది. దాంతో ఇమ్మాన్యుయల్ కెప్టెన్ గా గెలిచాడు. ఇక గెలిచాక కెప్టెన్సీ బ్యాండ్ ని తనూజ చేత పెట్టించుకున్నాడు. ఇక హౌస్ అంతా ఫుల్ హ్యాపీగా ఉండగా.. తనూజ కుప్పకూలింది. డాక్టర్ డాక్టర్ అంటు తనూజ అనగా.. వెంటనే గౌరవ్, సాయి శ్రీనివాస్ తో పాటు మిగిలిన హౌస్ మేట్స్ తనని మెడికల్ రూమ్ కి తీసుకెళ్ళారు. దాంతో ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ఏడ్చేశారు. కాసేపటికి తనూజ హౌస్ లోకి వచ్చేసింది.