English | Telugu
Srija Dammu Re entry in Bigg Boss 9 Telugu: శ్రీజ దమ్ము రీఎంట్రీ.. మరో కామనర్ కూడా!
Updated : Oct 25, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం మాములుగా లేదు.. హౌస్ లో దొంగలు పడ్డారు.. వారిలో నుండి కొంతమంది కెప్టెన్సీ కంటెండర్స్ రేసులో నిలిచారు. అయితే చివరకి ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. అయితే హౌస్ లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ రీఎంట్రీ ఉంటుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఆ ఎక్స్ కంటెస్టెంట్ ఎవరో కాదు అయిదో వారం ఎలిమినేషన్ అయిన శ్రీజ. తనది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని బిబి ఆడియన్స్ రచ్చ రచ్చ చేశారు. దాంతో బిగ్ బాస్ సీజన్-9 తెలుగుపై ఓ బజ్ క్రియేట్ అయింది. సో ఆ బజ్ ని మళ్ళీ తీసుకురావడానికే శ్రీజని హౌస్ లోకి రీఎంట్రీ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీజ హౌస్ లో ఉన్నప్పుడు తన మాటలతో హౌస్ మేట్స్ ని భయపెట్టేది. గేమ్ కంటే ఎక్కువగా తన వాయిస్ వినపడేది. దాంతో ఆడియన్స్ కు తన వాయిస్ పై చిరాకేసింది. దాంతో ఆమె ఎలిమినేషన్ లో ఓట్లు తక్కువగా వేశారు. దాంతో తను లీస్ట్ లో ఉంది. కానీ ఆ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో మొదటగా ఫ్లోరా సైనీని బయటకి పంపగా.. డబుల్ ఎలిమినేషన్ గా శ్రీజని ఎలిమినేషన్ చేశారు. అయితే కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఒపీనియన్స్ తో శ్రీజని ఎలిమినేషన్ చేశారు బిగ్ బాస్. దాంతో అది కంప్లీట్ గా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అయింది.
శ్రీజ హౌస్ నుంచి బయటకు వచ్చేసాక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తనది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని రీఎంట్రీగా తీసుకురావాలని బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేసారు ఆడియన్స్. ఈ వీకెండ్ సండే ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీజ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. శ్రీజతో పాటు మరో కామనర్ కూడా హౌస్ లోకి రానున్నాడని తెలుస్తోంది. అతను ఎవరో కాదు మాస్క్ మ్యాన్ హరీష్. కామనర్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హరిత హరీష్. తన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తన ముక్కుసూటి తనంతో హౌస్ లో ఎన్నో గొడవలు పడుతూ రచ్చ చేశాడు. ఇక ఇప్పుడు మాస్క్ మ్యాన్ మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. హరీష్ ఎంట్రీతో హౌస్ లో రచ్చ డబుల్ అవవడం ఖాయమని ఆడియన్స్ భావిస్తున్నారు. హరీష్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.