English | Telugu

రాము మనిషిలా కనపడట్లేదా.. తనూజకి నాగార్జున వార్నింగ్!

తనూజకి వార్నింగ్.. రీతూకి చివాట్లు.. సంజనకి పెద్ద క్లాస్.. ఇమ్మాన్యుయల్ ఇన్ కన్ఫ్యూషియస్.. ఇదంతా చేసింది మన నాగార్జున. అదే బిగ్ బాస్ సీజన్-9 హోస్ట్ నాగార్జున. అయితే ఒక్కో దానికి ఒక్కో కారణం ఉంది. అయితే వాటిల్లో ప్రతీ నామినేషన్లో ఉండే తనూజ నిజస్వరూపాన్ని ఆడియన్స్ కి వీడియో వేసి మరీ చూపించాడు నాగార్జున.

నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో.. తనూజని లేపి అసలు మీ ప్రాబ్లమ్ ఏంటమ్మా అంటూ నాగార్జున అడిగాడు. దాంతో తను షాక్ అయింది. రాము రాథోడ్ నీకు మనిషిలా కనిపించడం లేదా.. మెతకగా ఉన్నాడని చులకనా అంటూ తను రాముని అవమానించిన వీడియోని ప్లే చేసి మరీ చూపించాడు నాగ్ మామ.

నిన్నటి వరకు జరుగిన దొంగల టాస్క్ లో జరిగిన ఈ ఇష్యూని పెద్ద ఇష్యూగా చూపించాడు నాగ్ మామ. అసలేం జరిగిందంటే.. వాంటెడ్ పేట టాస్క్ లో తనూజ, సాయి, రీతూ మాట్లాడుకుంటుండగా.. రాము రాథోడ్ మధ్యలో వెళ్లి కూర్చుంటాడు. తనూజ అసహనంతో అక్కడి నుంచి రీతూ, సాయిని తీసుకుని వెళ్లి రాముని అవమానపరుస్తుంది. ఇది కరెక్ట్ కాదని, మనుషులకు వాల్యూ ఇవ్వాలంటూ తనూజకి నాగార్జున చీవాట్లు పెట్టాడు. ఆ తర్వాత తనూజ, రీతు చౌదరి ఇద్దరి అసలేం జరిగిందో నాగార్జునకి తెలియజేశారు.