English | Telugu

Ramya Moksha Elimination: రమ్య మోక్ష ఎలిమినేషన్.. ఆడియన్స్ రివేంజ్ సక్సెస్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఆడియన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురుచూసిన ఎలిమినేషన్ ఏదైనా ఉందంటే అది ఇదే.. నిన్నటి రమ్య ఎలిమినేషన్. ఎందుకంటే తన నెగెటివ్ మాటలు, తన ఆటతీరు ఆడియన్స్ ఎవరికి నచ్చలేదు. అందుకే తనకి అసలు ఓట్లే వేయకుండా ఎలిమినేషన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అలానే చేసారు. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.

ఆదివారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్లో ఉన్నవారిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇక చివరగా సంజన, రమ్య మోక్ష మిగిలారు. వారిమధ్య ఎలిమినేషన్ రౌండ్ జరుగుతుందని వారిని యాక్టివిటీ ఏరియాకి రమ్మని పిలిచాడు నాగార్జున. ఇక అక్కడ వారిద్దరిపై మేఘాలతో సెటప్ చేశాడు బిగ్ బాస్. రమ్య-సంజన ఈరోజు మీ ఆట మీద మబ్బులు అలుముకున్నాయి.. మీ ఇద్దరి పైనా క్లౌడ్స్ ఆర్ వెయిటింగ్.. ఎవరి మేఘం నుంచి అయితే వర్షం పడుతుందో వాళ్లు సేఫ్.. ఎవరి మేఘం అయితే వర్షించదో వాళ్లు ఎలిమినేటెడ్.. నేను వారి కోసం స్టేజ్ మీద వెయిట్ చేస్తూ ఉంటానని నాగార్జున అన్నాడు. ఇంతలో ఇమ్మాన్యుయల్ నీ దగ్గర పవరాస్త్ర ఉంది.. దానికి సేవింగ్ పవర్ కేవలం లాస్ట్ వీక్ మాత్రమే ఉంది.. ఆ పవర్ నీకు లేదు ఇక.. నీ క్లారిటీ కోసం ఆడియన్స్ క్లారిటీ కోసం మళ్లీ ఈ విషయం నీకు చెప్తున్నానని నాగార్జున అన్నాడు. అలానే తనూజ నీ దగ్గర గోల్డెన్ బజర్ ఉంది.. దానికి ఒకరిని సేవ్ చేసే పవర్ ఉంది.. కానీ అది వచ్చే వారం నుంచే.. ఇప్పుడే గెలుచుకున్నావ్ కాబట్టి దానికి ఆ పవర్ లేదంటూ నాగార్జున చెప్పాడు.

ఇక సంజన తల మీద ఉన్న మేఘం నుంచి వర్షం కురిసింది. దీంతో రమ్య యూఆర్ ఎలిమినేటెడ్.. సంజన నువ్వు సేఫ్.. అని నాగ్ ప్రకటించారు. వెంటనే సంజనకి హగ్ ఇచ్చి చెప్పా కదా నువ్వు ఉంటావని అని రమ్య అంది. అప్పుడే వెళ్లిపోతున్నావ్ ఏంట్రా అని సంజన అంటే టైమ్ వచ్చింది నన్ను బయట పిలుస్తున్నారు వెళ్లాలని రమ్య నవ్వుతూ చెప్పింది. యాక్టివిటీ రూమ్ నుంచి బయటికి రాగానే డీమాన్ నిల్చొని ఉన్నాడు. బై పవన్.. అని చెప్పేసి సుమన్ శెట్టి నుదుటి మీద కిస్ ఇచ్చి బై చెప్పింది రమ్య. ఇంతలో మాధురి వచ్చి రమ్యని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టింది. ఏడవద్దు మీరు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది.. నేను నవ్వుతూ వెళ్లాలి.. నువ్వు ఫస్ట్ ఏం చెప్పావో అలాగే చెయ్ సరేనా.. బై లవ్యూ.. బయటికొచ్చాక కలుద్దాం సరేనా జాగ్రత్తా.. ఎక్కువ అరవకు.. అంటూ మాధురితో రమ్య అంది. నేను నెక్స్ట్ వీక్ వచ్చేస్తానంటూ మాధురి ఏడుస్తూ చెప్పింది. ఆ తర్వాత తనూజ సహా అందరికి బై చెప్పేసి రమ్య వెళ్తుంటే రేయ్ నాకు బై కూడా చెప్పవా రమ్య అంటూ రీతూ అడిగింది. సారీరా.. బాగా ఆడు రీతూ ఓకేనా అంటూ రమ్య చెప్పింది. గేటు దగ్గరికి వెళ్లే ముందు జాగ్రత్త నువ్వు బాగా ఆడు ఫ్యామిలీని గుర్తు తెచ్చుకో నేను సపోర్ట్ చేస్తా బయటికెళ్లాక అంటూ డీమాన్‌కి రమ్య మరీ మరీ చెప్పింది.