పృథ్వి కి ... ప్రపోజ్ చేసిన విష్ణుప్రియ
సుమ అడ్డా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి నబీల్, సీత, విష్ణుప్రియ, ప్రిథ్వి వచ్చారు. ఇక మళ్ళీ విష్ణు ప్రియా, ప్రిథ్వి లవ్ స్టోరీ మొదలయ్యింది. ఇక విష్ణు ప్రియా రాగానే "చిన్నప్పటి నుంచి పెద్దయ్యేవరకు ఒకటే సేమ్ గా ఉంటాయి..అవి కళ్ళు. మన ముక్కు పెరిగినట్టు మన కళ్ళు పెరగవు. ఇక విష్ణు ప్రియా కాన్సంట్రేషన్ ప్రిథ్వి మీద పడింది. ఆయన బుగ్గలు చూడండి గులాబీ జామూన్స్ లా ఉన్నాయి" అనేసరికి అందరూ నవ్వేశారు. ఇక సుమ ఐతే విష్ణు ప్రియా, ప్రిథ్వితో "మీరు ఇప్పుడు ఒక హాంటెడ్ హౌస్ కి టూర్ కి వెళ్ళబోతున్నారు" అని చెప్పింది. దాంతో విష్ణు అక్కడ దెయ్యం మీరేనా అంటూ సుమ మీద సెటైర్ వేసింది. దానికి సుమ వెంటనే కౌంటర్ ఇచ్చింది. "నువ్వు ఉండగా నేనెందుకు అవుతా దెయ్యం..ఐనా నీకు దెయ్యం కనపడినా కూడా హహహ అనే నవ్వుతావుగా " అంది. ఇక సుమ వీళ్ళతో రాపిడ్ ఫైర్ ఆడించింది.