English | Telugu
శివన్నారాయణ షాక్.. కాశీ అబద్ధం చెప్పాడని తెలుసుకున్న శ్రీధర్!
Updated : Oct 26, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -498 లో.....సుమిత్ర మీ ఇంట్లోనే ఉన్నా మాకు చెప్పలేదు.. తన గురించి నా కొడుకు ఎంత క్షోభ అనుభవిస్తున్నాడు అయినా మీకు తన గురించి చెప్పాలనిపించలేదా అని శివన్నారాయణ అందరిపై విరుచుకుపడతాడు. నేను చెప్పేది వినండి అని కార్తీక్ మాట్లాడబోతుంటే.. నువ్వు నాకేం చెప్పకు నా కోడలుని నా ఇంటికి తీసుకొని వెళ్తాను.. అడ్డుపడితే నా మీద ఒట్టే అని శివన్నారాయణ అంటాడు. అత్తని తీసుకొని వెళ్తే అత్త బ్రతకదని కార్తీక్ అనగానే శివన్నారాయణ షాక్ అవుతాడు.
నిజం తాతయ్య అని సుమిత్ర అన్న మాటలు శివన్నారాయణకి దీప చెప్తుంది. నేను ఇక్కడ ఉన్నట్లు చెప్తే నేను చచ్చినంత ఒట్టే అని అమ్మ అంది అందుకే చెప్పలేదు తాతయ్య అని దీప అనగానే ఇంతసేపు వాళ్ళని తిట్టినందుకు గిల్టీగా ఫీల్ అవుతాడు శివన్నారాయణ. అత్తని మాములు మనిషిని చేసి ఇంటికి తీసుకొని వస్తాను. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఇక్కడ నుండి కూడా వెళ్తుందని కార్తీక్ అనగానే నువ్వు నాతో రా కార్తీక్.. అక్కడ నా కొడుకుని కూడా మార్చాలని శివన్నారాయణ అంటాడు. మరొకవైపు కాశీ హడావిడి గా ఆఫీస్ కి వెళ్తాడు. ఏంటి అంత హడావిడి అని స్వప్న తో శ్రీధర్ అంటాడు. మీటింగ్ ఉందట నాన్న అని స్వప్న చెప్తుంది.
మరొకవైపు సుమిత్రతో కాంచన, దీప మాట్లాడుతారు. దశరథ్ అన్న మాటలు సుమిత్ర గుర్తుచేసుకొని బాధపడుతుంది. కాంచన, దీప తనని మార్చే ప్రయత్నం చేస్తారు అయిన సుమిత్ర నేను ఆ ఇంటికి వెళ్ళనని అంటుంది. ఆ తర్వాత కాశీ తన ఫ్రెండ్ తో ఉండడం శ్రీధర్ చూసి కాశీకి ఫోన్ చేస్తాడు. మావయ్య నేను మీటింగ్ లో ఉన్నానని అబద్దం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. నాకు జాబ్ రాలేదని మావయ్యకి తెలియకూడదని కాశీ అనుకుంటాడు. జాబ్ రాకున్నా వచ్చింది అని నాకే అబద్దం చెప్తావా అని కాశీ ఫోటో తీస్తాడు శ్రీధర్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.