English | Telugu
Jayam serial : సూర్యకి పొంచి ఉన్న ప్రమాదం.. గంగ ఏం చేయనుంది!
Updated : Oct 25, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -92 లో.. పారు తనని ఎవరు ఇబ్బంది పెట్టారని సీసీటీవీలో చూస్తుంది. అందులో గంగ మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్లి బయటకు రావడం ఉంటుంది. మాస్క్ లేకుండా పారుకి వాటర్ ఇవ్వడం ఉంటుంది. అది ఎవరని తెలుసుకోడానికి స్నేహాని పిలుస్తుంది పారు. మీ అన్నయ్యని నేను ఇబ్బంది పెట్టానని ఏవతో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టింది.. అది ఎవరో చూడని పారు అడుగుతుంది. గంగని స్నేహ చూసి.. దీంతో పెట్టుకుంది ఏంటి గంగ గురించి చెప్పకూడదని అనుకొని.. నాకు ఆవిడా తెలియదని స్నేహ చెప్తుంది.
మరొకవైపు గంగ టిఫిన్ సెంటర్ దగ్గర వర్క్ చేస్తుంటే సైదులు తనకి మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేయాలనుకుంటాడు కానీ అప్పుడే వీరు ఫోన్ చేసి నువ్వు ముందు చంపాల్సింది గంగని కాదు నా తమ్ముడు సూర్యని అని వీరు చెప్తాడు. సూర్య ఇప్పుడు రుద్ర దగ్గర అంటే మా ఇంట్లో ఉన్నాడు.. నా గురించి మొత్తం చెప్తాడు.. దాంతో నువ్వు వాడిని చంపేయ్ అని అంటాడు. మరొకవైపు ప్రీతి, ప్రమీల, స్నేహ ముగ్గురు కలిసి రుద్ర దగ్గరికి వెళ్తారు. ప్రీతీ ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తారు. దాంతో రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత గంగ ఇంటికి వచ్చేసరికి పైడిరాజు, మణి డ్రింక్ చేస్తుంటారు. ఇంత జరిగిన వాడితో కలిసి డ్రింక్ చేస్తున్నావని గంగ వాళ్ళ నాన్నపై కోప్పడి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత ప్రీతి, స్నేహ, ప్రమీల హాల్లో కి వచ్చి ఇంట్లో అందరికి ప్రీతి ప్రెగ్నెంట్ అని చెప్తారు. దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వీరు మొహంలో ఎలాంటి సంతోషం కన్పించదు. మరోవైపు పైడిరాజు, మణి మందు తాగుతుంటారు. నీ కూతురు నా అప్పు తెర్చేలా ఉంది.. నేను పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదని పైడిరాజుతో మణి అంటాడు. సరే నీ ఇష్టం అని పైడిరాజు అంటాడు. నీ కూతురు ఇప్పుడు నిద్రపోతది కదా.. అప్పుడు వెళ్లి నిద్రలో తాళి కడతానని మణి చెప్పగానే పైడిరాజు సరేనని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.