English | Telugu

బుల్లితెర నటుడు కాళిదాసు మహేష్ బాబు - సాండ్రా పెళ్లి అక్టోబర్ 31 న

బుల్లితెర నటుడు కాళిదాసు మహేష్ బాబు సాండ్రాతో తన పెళ్లి ముహుర్తాన్ని రివీల్ చేసాడు. సమ ప్రయాణం అనే యూట్యూబ్ ఛానెల్ లో వాళ్ళు ఈ గుడ్ న్యూస్ ని చెప్పారు.  "నిజానికి మా పెళ్లి ఈపాటికి ఐపోయి ఉండాలి. శ్రావణ మాసంలో చేసుకోవాల్సి ఉంది. ఐతే ఆగష్టు లో డేట్ సెట్ అయ్యింది. కానీ అప్పుడు షూటింగ్స్ ఉన్నాయి. అలాగే పెళ్లి అంటే చాలా చేయాలి. మినిమం ఒక పది రోజులు పడుతుంది. ఐతే సాండ్రాకి  కార్తీక మాసంలో పెళ్లి చేసుకోవాలని మనసులో అనుకుంది. శ్రావణ మాసంలో మా ఇద్దరికీ సంబంధించిన ఏదో ఒక విషయం జరగాలని సాండ్రా కోరుకుంది. అందుకే శ్రావణ మాసంలో శ్రీశైలంలో ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకున్నాం చేసుకున్నాం. అలా ఒక శుభకార్యం జరిగింది. కాబట్టి కార్తీక మాసంలో పెళ్లి చేసుకోవాలి అనుకుని ముహూర్తాలు చూడమని చెప్తే ఒకే ఒక్క డేట్ వచ్చింది.

నా వయసు 35  అంటున్న శరత్ కుమార్

"డ్యూడ్" మూవీ ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది. దాంతో హీరో ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్ ఇద్దరూ నెక్స్ట్ వీక్ జబర్దస్త్ షోకి గెస్టులుగా రాబోతున్నారు. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. వీళ్ళు స్టేజి మీదకు రాగానే రష్మీ అడిగింది. "ఈ అల్లుడు నుంచి ఎం క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాలో " అంటూ ప్రదీప్ ని చూపించి శరత్ కుమార్ ని అడిగింది రష్మీ. "మంచి అల్లుడు అండి. నేను ఎం చెప్తానో అది చేస్తారు. ఇప్పుడు కాదండి పిక్చర్ లో చెప్తున్నాను " అంటూ చెప్పారు శరత్ కుమార్. ఇక ప్రోమో లాస్ట్ లో ఐతే రాంప్రసాద్ శరత్ కుమార్ తో ఇలా అన్నాడు. "శరత్ కుమార్ సర్ ఈ ఏజ్ లో కూడా మీ బాడీ ఫిట్నెస్ ఉంటుంది సర్ దానికి హ్యాట్సాఫ్ సర్" అన్నాడు. వెంటనే ఆయన థ్యాంక్యూ అని చెప్పారు.

నెలకు 2 లక్షలు సంపాదించాలి...కాబోయే భర్త క్వాలిటీస్ గురించి చెప్పిన శ్రీనిధి

శ్రీనిధి శెట్టి రీసెంట్ టైమ్స్ లో ఫార్మ్ లోకి వచ్చిన హీరోయిన్. రీసెంట్ గా తెలుసు కదా అనే మూవీలో రాశిఖన్నాతో పాటు నటించింది. ఇక ఈమె ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి ఈ వీక్ వచ్చింది. అలాగే శ్రీనిధి తనకు కాబోయే ఫ్యూచర్ హజ్బెండ్ ఎలా ఉండాలో శ్రీముఖి ఇచ్చిన టాస్క్ లో చెప్పింది. "తెలుసుకోవాలి కదా" అనే గేమ్ లో అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పింది. అబ్బాయికి ఏజ్ వచ్చేసరికి మొదటి ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంది కానీ తర్వాత అసలు విషయం చెప్పింది. 30  - 40 మధ్యలో ఉండాలని చెప్పింది. అలాగే ఇక అబ్బాయి హైట్ 5 ' 8 కి మించి ఉండాలని చెప్పింది. ముద్దు పెట్టడానికి నుదురు అందేలా ఉంటే చాలు అని చెప్పింది. ఇక వెయిట్ వచ్చేసరికి 70 - 80 మధ్యన ఉండి ఫిట్ గా ఉండాలని అలాగే మంచి మనసు ఉండాలని చెప్పింది.

యాక్టర్ ఐనా డాక్టర్ ఐనా పర్లేదు .. కానీ ఏడాదికి కోటి రూపాయలు సంపాదించాలి

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఈ షోకి "తెలుసు కదా" మూవీ నుంచి రాశి ఖన్నా, శ్రీనిధి వచ్చారు. వీళ్ళు ఈ ఎపిసోడ్ కి అదనపు ఆకర్షణగా నిలిచారు. ఐతే వీళ్లకు ఫ్యూచర్ హజ్బెండ్స్ రావాలి అనే విషయం మీద శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్ పేరు "తెలుసుకోవాలి కదా" అంది. అందులో రాశి ఖన్నా తన కాబోయే భర్తలో ఈ క్వాలిటీస్ ఉండాలని చెప్పిందిలా.  "35 - 38 మధ్య వయసు ఉండాలి, 5 '9 నుంచి 6 '3 మధ్య అబ్బాయి హైట్ ఉండాలి అలాగే 85 కిలోల లోపు ఉండాలి అలాగే బాడీ ఫిట్ గా ఉండాలి" అని చెప్పింది." ఇక ఆస్తులు తనకు ఉన్నాయి కాబట్టి వచ్చే అబ్బాయికి ఆస్తులు లేకపోయినా పర్లేదు అని చెప్పింది.

Illu illalu pillalu : ఆనందరావు మాటలకి కన్విన్స్ అయిన రామరాజు.. భాగ్యం కోపానికి బలి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -294 లో.....మొన్న పార్టీలో ధీరజ్, ప్రేమ ముద్దు పెట్టుకున్నారని నర్మద చెప్పగానే ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావే అని వేదవతి అంటుంది. శ్రీవల్లిని అక్కడ నుండి పంపిస్తుంది వేదవతి. ఏంటే ధీరజ్, ప్రేమ మధ్య ప్రేమ మొదలు అయిందా అని వేదవతి అడుగుతుంది. అయింది పార్టీలో ముద్దు పెట్టుకున్నారట.. వాళ్ళ ఇద్దరిని ఒకటే చేసే బాధ్యత నాది అని నర్మద అంటుంటే.. ఓసిని గవర్నమెంట్ కోడలో అని నర్మదకి ముద్దుపెడుతుంది వేదవతి.