English | Telugu
హౌస్ లో ఎవరికి ఏం ట్యాగ్ వచ్చిందంటే!
Updated : Oct 26, 2025
బిగ్‌బాస్ సీజన్-9 లో ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ క్రేజీగా సాగింది. ఇందులో నాగార్జున ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ గట్టిగా కోటింగ్ ఇచ్చేశాడు. అయితే వారి తప్పులని చెప్పేముందు హౌస్ మేట్స్ చేత ట్యాగ్‌లు వేపించాడు. ఎవరేంటో.. ఎందుకో కారణం చెప్తూ ప్రతీ కంటెస్టెంట్ ఈ ట్యాగ్ లని వేయాలంటూ కొన్ని ట్యాగ్ లు తీసుకొచ్చాడు నాగార్జున.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. ముందుగా కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ కు కంగ్రాట్స్ చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత బ్యాండ్ లు ఇవ్వమన్నాడు నాగార్జున. మొదటగా రమ్య లేచి మాధురికి ఫేక్ బాండ్స్ అనే ట్యాగ్ ఇచ్చింది. తను హౌస్ లోకి వచ్చినప్పుడు బాండ్స్ వద్దు అన్నది. ఇప్పుడు తనూజాతో అవే బాండ్స్ పెట్టుకుంటోంది. అది కూడా ఫేక్ అని నాకు అనిపిస్తోందంటూ రమ్య చెప్పింది. బాండ్స్ వద్దు అనుకుంటున్న ఆమె నాతో ఎందుకు బాండ్స్ ఎందుకు కోరుకుంటోందని మాధురి ప్రశ్నించగా.. తనూజను ఇదే బాండ్ రీజన్ తో నామినేట్ చేశావు. బాండ్ అనుకుని గేమ్ లో వెనకబడుతున్నావని నాగార్జున అన్నాడు. తనూజా నీది మాధురిది ఫేక్ బాండా.. నాన్నను రాజుతో రీప్లేస్ చేశావా అని తనూజని నాగార్జున అడుగగా.. నాన్న బాండ్ అంటూ వచ్చారు. ఇప్పుడు మీరు దగ్గర అవుతున్నారు. ఇది నా గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పాను. ఆమె లేదు నేను జెన్యూన్. నీతోనే ఉంటానని అన్నారని తనూజకి మాధురి చెప్పిందని ఓ క్లారిటీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత రమ్యకు తనూజా మానిప్యులేట్ ట్యాగ్ ఇచ్చింది. సాయి - రమ్య - మాధురి గొడవ మిస్ కమ్యూనికేషన్ అంటూ నాగ్ క్లియర్ చేశాడు. ఆ తర్వాత ఏం ఆడావ్ పవన్ అంటూ డీమాన్ పై ప్రశంసలు కురిపించాడు నాగార్జున. మేము చేస్తే బ్యాక్ స్టాబింగ్, మీరు చేస్తే ఆటనా అంటూ కళ్యాణ్ కి ఇమ్మెచ్యూర్ అనే ట్యాగ్ ను ఇచ్చాడు డీమాన్ పవన్.
ఫౌల్ మౌత్డ్ ట్యాగ్ ను మధురికి ఇచ్చింది రీతు. కెప్టెన్సీ టాస్క్ లో రీతూ చేసింది వెన్నుపోటు అంటూ రీతూ మొహం మీదే చెప్పేశాడు నాగార్జున. మాధురి బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి. బిగ్ బాస్ హౌస్ లో కాదు. ఇలాంటి కఠినమైన పదాలు వాడొద్దంటూ మాధురికి నాగార్జున వార్నింగ్ ఇవ్వగా తను సారీ చెప్పింది. ఆ తర్వాత ఇన్ సెక్యూర్ ట్యాగ్ ను మాధురికి ఇచ్చింది సంజన.