English | Telugu
Bigg Boss 9 Telugu Voting: డేంజర్ జోన్ లో రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి.. బిగ్ షాక్ ఇవ్వనున్న బిగ్ బాస్!
Updated : Oct 25, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం దొంగల టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో సంజన వర్సెస్ మాధురి ఆడారు. ఈ టాస్క్ లో సుమన్ శెట్టి, తనూజ, రీతూ, దివ్య నిఖిత బాగా ఆడారు. అయితే ఈ వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నుండి ఒకరు ఎలిమినేషన్ ఫిక్స్. ఎందుకంటే లీస్ట్ లో వాళ్ళిద్దరే ఉన్నారు.
రీతూ చౌదరి, సాయి, రాము రాథోడ్, తనూజ, రమ్య మోక్ష, కళ్యాణ్ పడాల, సంజన, దివ్య నిఖిత ఈ ఏడుగురు ఏడవ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో డేంజర్ కంటెస్టెంట్‌గా ఉన్న రమ్య మోక్షని ఇంటికి పంపేందుకు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అందుకే తమకి అన్ అఫీషియల్ పోలింగ్ లో ఎందులో చూసినా లీస్ట్ ఓటింగ్ పడుతోంది. అయితే తనూజ మాత్రం ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్ తో నెంబర్ వన్ లో కొనసాగుతుంది.
తనూజ తర్వాత స్థానంలో కళ్యాణ్ పడాల ఇరవై శాతం ఓటింగ్ తో ఉన్నాడు. ఇక దివ్య నిఖిత పదకొండు శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంది. దివ్య హౌస్ లో పర్ ఫెక్ట్ గెస్ చేస్తోంది. వ్యాలిడ్ రీజన్లు చెప్తూ నిజాలు మాట్లాడుతూ ఫెయిర్ గా ఆడుతున్న దివ్యకి ఓటింగ్ గట్టిగానే ఉంది. ఈ వారంలో దివ్య టాప్-3లోకి వచ్చేసింది. శ్రీనివాస్ సాయికి పెద్దగా ఓటింగ్ లేదు.. అతని కంటెంట్ ఏం లేదు.. ఇంతవరకు ఏ టాస్క్ లో అతను కనపడలేదు. ఏదో నామమాత్రం హౌస్ లో ఉన్నట్టుగా అనిపిస్తోంది. అయితే ఎలాగైనా రమ్య మోక్షని హౌస్ నుంచి బయటకు పంపాలనే ఉద్దేశంతో ఎవరు ఓటింగ్ వేయడం లేదు. అంటే ఈ రమ్య మోక్ష హౌస్ లో ఉండటం కంటే బయటకి పంపించాలనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు. శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఖాయమనిపిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.