నాలో టాలెంట్ ని గుర్తించింది ఎస్పీ బాలు గారే..ఆయనే నాకు అవకాశాలు ఇచ్చారు
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. వైల్డ్ కార్డు ఎంట్రీ పేరుతో బ్రహ్మానందాన్ని ఈ షోకి గెస్ట్ గా పిలిచారు. ఇక బ్రహ్మానందం రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ థమన్, కార్తీక్, గీత, శ్రీరామ చంద్ర అలాగే సమీరా భరద్వాజ్ చెప్పుకొచ్చారు. ఇక కంటెస్టెంట్స్ కి తన స్టైల్ లో ఆల్ ది బెస్ట్ చెప్పారు. కంటెస్టెంట్ ధీరజ్ వచ్చి ఎస్పీ బాలు గారి బ్రెత్ లెస్ సాంగ్ "మాటే రాని" సాంగ్ పాడాడు. అలాగే ధీరజ్ ఆయన గురించి షేర్ చేసుకున్నాడు.