English | Telugu

ఎవరి వయసు ఎంతో తెలుసా.. ?

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. 90 స్ వెర్సెస్ జెన్ జి జెనెరేషన్స్ వాళ్ళు వచ్చారు. వీళ్ళ వయసు పుట్టిన ఏడాది కూడా శ్రీముఖి చెప్పించేసింది. 90 స్ టీమ్ లో గుప్పెడంత మనసు సీరియల్ ముఖేష్ అలియాస్ రిషి సర్ వచ్చాడు. తర్వాత శ్రీకర్ కృష్ణ వచ్చాడు. 1996 లో పుట్టినట్లు చెప్పాడు. అటు 90 స్ కాదు అలాగే జెన్ జి కాదు బోర్డర్ లో పుట్టాను అన్నాడు. ఇతను బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్నాడు. అలాగే విష్ణు ప్రియా వచ్చింది. ఈమె 1995 లో పుట్టినట్లు చెప్పింది. ప్లీజ్ మీరంతా నా ఫాన్స్ ఐతే నా డేట్ ఆఫ్ బర్త్ ని బాగా స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నా. గూగుల్ లో నా మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు 38 ఏజ్ అని ఉంది అని చెప్పింది విష్ణు ప్రియా. ఇంతకు ప్రిద్వి నీ ఫేస్ చూసి ఏజ్ అలా పెట్టారు అన్నాడు. వెంటనే విష్ణుకి కోపం వచ్చేసింది. చెడ్డీ అంకుల్ రిలాక్స్ అనేసింది. ఓకే ఆంటీ అంటూ కౌంటర్ ఇచ్చాడు ప్రిద్వి. ఇక డెబ్జానీ వచ్చింది. ఈమె 1996 లో పుట్టినట్లు చెప్పింది. తర్వాత శ్రవణ్ వచ్చాడు. 90 స్ లో పుట్టాను. అటు 80 స్ వాళ్ళను ఇటు 2000 లో పుట్టిన అన్నిటినీ చూసాం అని చెప్పాడు. మగువ ఓ మగువ సీరియల్ లో కృతికతో కలిసి నటించాడు. జెన్ జి జనరేషన్ టీమ్ ని రిప్రెజెంట్ చేయడానికి ప్రిద్వి వచ్చాడు. నాగ పంచమి సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఇతను 1998 లో పుట్టినట్లు చెప్పాడు. అంటే నువ్వు కూడా పిల్ల బచ్చాగాడివే అనేసింది శ్రీముఖి. ఇక అన్విత బుల్లితెర మీద సందడి చేసే ఈమె 2002 లో పుట్టిందట. ఇక శ్రీముఖి ఆమె వయసు విని 23 ఏళ్ళ నీకు ఇంత పిల్ల బచ్చాదానివా అంటూ కామెంట్ చేసింది. ఇక కృతిక కూడా వచ్చింది. మగువ ఓ మగువ సీరియల్ లో ఈమె నటించింది. ఈమె కూడా 2002 లో పుట్టినట్లు చెప్పింది. ఇక ఢీ షో ద్వారా ఫేమస్ ఐన మహేశ్వరీ వయసు అడిగేసరికి 1999 అని చెప్పింది. అంటే నువ్వు నిబ్బి కిందకు రాదు నిబ్బా కిందకు వస్తుంది అంటూ ఫన్నీ కౌంటర్ వేసింది శ్రీముఖి . ఇక నైనికా అనసుర సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ఫుల్ ఫేమస్ ఐన ఈమె 2001 లో పుట్టినట్లు చెప్పుకొచ్చింది.