English | Telugu
దీపావళి పండుగకి కొడుకులకి కొత్త బట్టలు తీసుకున్న రామరాజు.. బొమ్మరిల్లు ఇదేనా!
Updated : Oct 26, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -299 లో.....వేదవతి రెడీ అయి హాల్లోకి వచ్చి పేరుకే ముగ్గురు కోడళ్ళు కానీ ఒక్కరు కూడ పూజకి ఏర్పాట్లు చెయ్యడం లేదని వేదవతి అంటుంది. ప్రేమ రెడీ అయి వచ్చి శ్రీవల్లి అక్క అని పిలుస్తుంది. శ్రీవల్లి రాత్రి జరిగింది గుర్తుచేసుకొని ప్రేమ ని చూసి బయపడి టేబుల్ కింద దాక్కుంటుంది. ఏంటి అక్క అక్కడ ఉన్నావని ప్రేమ అడుగుతుంది. ఏం లేదని శ్రీవల్లి కవర్ చేస్తుంది.
నాకు తలనొప్పిగా ఉంది నువ్వు టీ బాగా పెడుతావ్ కదా అందుకే పెట్టమని పిలిచానని ప్రేమ అనగానే అంటే నీకు రాత్రి జరిగింది గుర్తు లేదా అని శ్రీవల్లి అడుగుతుంది. లేదు ఏం జరిగిందని ప్రేమ అడుగుతుంది. దాంతో వెంటనే శ్రీవల్లి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నర్మద, వేదవతి ఇద్దరు వచ్చి రాత్రి ఏం చేసావో తెలుసా అని జరిగింది చెప్తారు. అయ్యో అలా చేసానా నేను కూల్ డ్రింక్ తాగాను అంతే అని ప్రేమ చేప్తుంది. తిరుపతి వచ్చి కూల్ డ్రింక్ లో మందు కలిపానని చెప్తాడు. దాంతో తిరుపతిని వేదవతి తిడుతుంది. మరొకవైపు సేనాపతి డల్ గా ఉంటాడు. రేవతి వచ్చి త్వరగా రెడీ అవ్వండి.. దీపావళి సెలెబ్రేషన్స్ దగ్గరికి వెళ్ళాలనగానే సేనాపతి కోప్పడతాడు. నా చెల్లి, నా కూతురు ఈ ఇంటిని చీకటి చేశారని సేనాపతి ఆవేశపడుతుంటే.. విశ్వ వచ్చి నెక్స్ట్ దీపావళి వరకు ప్రేమ ఈ ఇంట్లో ఉంటుందని సేనాపతికి విశ్వ చెప్తాడు. విశ్వ పక్కకి రాగానే భద్రవతి వస్తుంది. ఇక లేట్ చేయను అత్త.. అనుకున్నది చేస్తానని భద్రవతితో చెప్తాడు. ఆ తర్వాత రామరాజు ముగ్గురు కొడుకులకి బట్టలు తీసుకొని వస్తాడు. ముగ్గురు కోడళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏం చూసారు ఇప్పుడు బొమ్మరిల్లు సీన్ నడుస్తుంది. ఆ బట్టలు వాళ్ళకి నచ్చవు అయినా మీదికి యాక్టింగ్ చేస్తారు. ఎప్పుడు అవే బట్టలని ముగ్గురు కొడుకులు అనుకుంటారు. కానీ పైకి మాత్రం బాగున్నాయ్ నాన్న అని చెప్తారు.
అదంతా ముగ్గురు కోడళ్ళు చూసి నవ్వుకుంటారు. ముగ్గురు కొడుకు కోడళ్ళు వరుసగా వచ్చి రామరాజు, వేదవతి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పూజ దగ్గర కూర్చొని ఉంటారు. ప్రేమ జాకెట్ కి ఉన్న స్టోన్ లో ధీరజ్ షర్ట్ ఇరుక్కుంటుంది. మీ బంధం అంత త్వరగా వదలదని నర్మద అంటుంది. తరువాయి భాగంలో రామరాజు ఇంటికి పోలీసులు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.