English | Telugu
సేఫ్ గేమ్ ఆడొద్దంటూ ఇమ్మాన్యుయల్ ని నెగెటివ్ చేసిన హోస్ట్!
Updated : Oct 25, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం ఆసక్తికరంగా సాగింది. అందులో కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, తనూజల మధ్య నామినేషన్ లో జరిగిన ఇష్యూ గురించి నాగార్జున మాట్లాడాడు. మొదటగా నువ్వు మాట్లాడినప్పుడు నామినేషన్ స్లిప్ కోసం ఎవరిని నామినేట్ చేస్తానని ఇమ్మాన్యుయల్ తో చెప్పావని కళ్యాణ్ ని నాగార్జున అడిగాడు. తనూజ సర్ అని కళ్యాణ్ చెప్పాడు. మరెందుకు చేయలేదని నాగార్జున అడుగగా.. అంటే అప్పటికే తనూజని రమ్య నేను అనుకున్న పాయింట్స్ తో నామినేట్ చేసింది.. అందుకే చేయలేదు .. అందులో నాదే తప్పు సర్.. నేను చెప్పిన పేరు నామినేట్ చేయలేదని కళ్యాణ్ ఒప్పుకున్నాడు. నువ్వు స్లిప్ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ మాట స్లిప్ అయ్యాడని ఫీలయ్యావా అని ఇమ్మాన్యుయల్ నాగార్జున అడిగాడు. అవును సర్.. అంటే అప్పటికప్పుడు పేరు ఎందుకు మార్చుకున్నాడు.. అవతలి వ్యక్తికి తను నామినేట్ చేద్దామనుకున్న విషయం తెలియకూడదని అలా చేశాడా.. అనేది నాకు అర్థం కాలేదు సర్.. అందుకే కళ్యాణ్.. తనని నామినేట్ చేద్దామనుకున్న పాయింట్ తనూజకి తెలియాలనే అక్కడ ఆపి మరీ చెప్పాను సర్.. అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. అతను చెప్పినట్లు తనూజని నామినేట్ చేయలేదని నీకు కోపం వచ్చిందా లేక సంజనని చేశాడని నీకు కోపం వచ్చిందా అని ఇమ్మాన్యుయల్ ని నాగార్జున అడిగాడు. సంజన గారిని చేశాడని నాకు కోపమేమి రాలేదు సర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు.
స్లిప్ కోసం నిన్ను మోసం చేశాడు అంతేనా.. నువ్వు కళ్యాణ్‌ని సేఫ్ అంటున్నావ్.. మరి నీ దగ్గరున్న స్లిప్ కళ్యాణ్‌కి ఇచ్చే బదులు అది నీ దగ్గరే ఉంచుకొని నువ్వే నామినేట్ చేయొచ్చు కదా.. సేఫ్ ఆడావా.. అని నాగార్జున అడుగగా.. లేదు సర్ తనూజని నామినేట్ చేయాలన్నది నా లక్ష్యం కాదు సర్.. ఒకవేళ తనూజని నేను నామినేట్ చేయాలంటే నాకు సింగిల్ పాయింట్ మాత్రమే ఉంది.. అది కూడా పాయింటా లేక నేను అపార్థం చేసుకున్నానా అన్నది నాకు అర్థం కాలేదు.. అందుకే ఆ ఒక్క పాయింట్ మీద తనని నామినేట్ చేయాలని నేను అనుకోలేదు.. అందుకే తనకి ఇచ్చేశానని ఇమ్మాన్యుయల్ అన్నాడు. అంటే నీకు నామినేట్ చేయాలని అనిపించలేదు కానీ కళ్యాణ్‌తో నామినేట్ చేయించాలని అనిపించింది అంతేనా అని నాగార్జున అడుగగా.. కళ్యాణ్‌తో నామినేట్ చేయించాలని అనుకోలేదు సర్.. ఎందుకంటే అలా అయితే రమ్య ఆల్రెడీ తనూజని నామినేట్ చేస్తానని చెప్పింది.. అందుకే వాళ్లు వాళ్లు చూసుకుంటారని వాళ్లిద్దరికి ఇచ్చేశా.. కళ్యాణ్ అనే వ్యక్తి తనూజ పేరు చెప్పగానే నేను షాకయ్యాను.. తన చుట్టూనే ఉంటాడు కదా అలాంటి వ్యక్తి ఏం చెప్తాడా అని నేను చూశాను.. అంతేకానీ తను నామినేట్ అవ్వాలి తను ఎలిమినేట్ అవ్వాలనేది నా మైండ్‌లో లేదు సర్.. అని ఇమ్మాన్యుయల్ క్లారిటీ ఇచ్చాడు.
ఒకవేళ కళ్యాణ్ నీ దగ్గర స్లిప్ తీసుకునే టైమ్‌లో సంజనని నామినేట్ చేస్తానని చెప్తే ఇచ్చేవాడివా అని నాగార్జున అడిగితే.. ఇవ్వను సర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. తనూజనే కాదు ఎవరిని నామినేట్ చేస్తానన్నా కళ్యాణ్‌కి స్లిప్ ఇస్తానని ఇప్పుడే చెప్పావ్ కదా అని నాగార్జున అన్నాడు. లేదు సర్ సంజన గారిని నామినేట్ చేస్తానంటే ఆలోచించేవాడ్ని అన్నాను సర్ అని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. ఇమ్మాన్యుయల్ మాటలు విన్న తర్వాత నాగార్జున వీడియో ప్లే చేశాడు. ఇందులో కళ్యాణ్‌తో ఇమ్మాన్యుయల్ చాలా క్లియర్‌గా తనూజని నామినేట్ చేయడం గురించి మాట్లాడాడు. నీరు పోసి చచ్చిపోతున్న మొక్కని పెంచినట్లయిందంటూ కళ్యాణ్ తో ఇమ్మాన్యుయల్ అన్నాడు. ఈ వీడియో చూసి తనూజ షాకైంది. ఇప్పుడు మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసినదానికి అక్కడ వీడియోలో ఉన్నదానికి ఏమైనా సంబంధం ఉందా ఇమ్మాన్యుయల్ అని నాగార్జున అడుగగా.. సర్ అంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత వాడొచ్చి సారీ చెప్తుంటే నేను అది చెప్పాను సర్.. ఇచ్చిన మాట తప్పితే నీ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది.. సర్లే అయిపోయింది ఏదో అయిపోయింది అన్నట్లు చెప్పాను సర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. నీళ్లు పోసి పెంచడం అన్న పాయింట్ అవసరమా అని నాగార్జున అన్నాడు. అది పర్సన్ గురించి చెప్పలేదు సర్.. అన్నా నాకు నమ్మకం పోతుందని వీడు చెప్పాడు.. నా వల్ల కావట్లేదని చెప్పుకుంటూ వచ్చాడు.. నీకు నమ్మకం పోయినప్పుడు నువ్వు ఉన్నదాని మీదే ఉండాలి కదా.. ఆల్రెడీ పోయినదాన్ని నువ్వు నీళ్లు పోసుకొని పెంచుకుంటున్నావ్.. ఒకసారి నువ్వు చూడు ఈరోజు కూడా గమనించు అని చెప్పా సర్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. వెంటనే చచ్పిపోయిన మొక్క ఒకసారి లే అమ్మా అంటూ తనూజని పిలిచాడు నాగార్జున. ఆ వీడియో మీద నీ అభిప్రాయం ఏంటని అడిగితే.. నేను షాకవుతున్నా సర్.. నిజానికి మీరు అడిగిన ప్రశ్నే నేను ఇమ్మాన్యుయల్ ని అడిగా.. ఒకవేళ నీకు నామినేట్ చేయాలంటే నువ్వే చేయొచ్చు కదా అని అన్నా.. ఇలా సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని అడిగా.. కానీ ఇంత జరిగిందని నాకు తెలీదు సర్ అని తనూజ చెప్పింది.
ఇమ్మాన్యుయల్ నువ్వు గ్యారెంటీగా సేఫ్ ఆడావ్ ఇక్కడ.. నీ దగ్గరున్న పాయింట్ చిన్నదా పెద్దదా అన్న విషయం పక్కన పెట్టు.. నువ్వు స్లిప్ ఇచ్చి తనూజని నామినేట్ చేస్తాడని ఎక్స్‌పెక్ట్ చేశావ్.. నువ్వు అనుకున్నది జరగకపోయేసరికి చిన్న కోపం వచ్చింది.. దీనికి తోడు సంజనని నామినేట్ చేసేసరికి బాధ వచ్చేసింది.. నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఒక్కటే.. మనం అందరినీ మెప్పించలేం.. అందరి దృష్టిలో మంచిగా ఉండలేం.. సేఫ్ మాత్రం ఆడొద్దు.. నీకు పాయింట్ ఉంటే నువ్వే చెప్పు.. వేరే వాళ్లని అస్త్రాలు చేయాల్సిన పని లేదు.. నీ దగ్గరే పవరాస్త్ర ఉందంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి తనూజ దృష్టిలో ఇమ్మాన్యుయల్ ని సేఫ్ గేమర్ ని చేశాడు నాగార్జున. ఈ ఇష్యూలో ఎవరిది తప్పో కామెంట్ చేయండి.