ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో కుల రాజకీయాలు... పేరు మార్చుతారన్న ప్రచారంపై కలకలం...
ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రెండు సామాజిక వర్గాల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది. దాంతో ఎవరు అధికారంలోకొస్తే, వాళ్లు తమ వర్గానికి పెద్దపీట వేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. చంద్రబాబు హయాంలో తన సామాజిక వర్గానికే ప్రతిచోటా కీలక పదవులను కట్టబెట్టారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది కూడా టీడీపీ ఘోర పరాజయం పాలవడానికి...