English | Telugu
ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు నేటితో బంద్
Updated : Sep 30, 2019
ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు నేటితో తెరపడనుంది. ప్రైవేటు మద్యం షాపులు కనుమరుగై.. వాటి స్థానంలో ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు మద్యం దుకాణాలకు సెప్టెంబరు 30వ తేదీ చివరి రోజు. 1వ తేదీ నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో, షాపులను ఖాళీ చేసే పనుల్లో మద్యం వ్యాపారులు ఉన్నారు. మరోవైపు, ఎక్సైజ్ శాఖ అద్దెకు తీసుకున్న దుకాణాల్లో సరుకు నింపి.. సిబ్బందిని సమకూర్చుకుని.. కొత్తగా అమ్మకాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి విడతలో ప్రస్తుతం ఉన్న 4,380 షాపుల్లో 20 శాతం తగ్గించి, 3,448 దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.