English | Telugu
హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోరు... తాము ఎవరికీ కొమ్ము కాయడం లేదు
Updated : Sep 30, 2019
హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోరులో నామినేషన్ ఘట్టం ముగియనుంది. నామినేషన్ సమర్పణకు ఈరోజే ఆఖరు తేది, మరోవైపు పొత్తులు, యుక్తులతో ఉప ఎన్నికలను రాజకీయ పార్టీ నేతలు క్రమంగా వేడెక్కిస్తున్నారు. తమ అభ్యర్థికి మద్దతు ప్రకటించారని టి.ఆర్.ఎస్ ఇప్పటికే సీబీఐ ని కోరింది. ఓటమి భయంతోనే టీ.ఆర్.ఎస్ పొత్తులకు వెళుతోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది, మరోవైపు మేము బరిలో ఉన్నామంటోంది టిడిపి.
హుజూర్ నగర్ లో నామినేషన్ లకు ఈరోజే ఆఖరు తేదీ కావడంతో పోలీసు బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేశారు. అనుమతి లేని ర్యాలీలు, సభలపై ఉక్కుపాదం మోపుతామన్నారు ఎస్పీ వెంకటేశ్వరులు. ఎన్నికల నిర్వహణ లో పారదర్శకంగా ఉంటామన్నారు. ఎన్నికల నేపథ్యంలో హుజూర్ నగర్ లో 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ ఉప ఎన్నికలు పొలిటికల్ గా సెన్సిటివ్ కాబట్టి ఎన్ ఫోర్స్ మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో పదమూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయటం జరిగిందని, దీంట్లో ఐదు చెక్ పోస్టులు ఆంధ్రా బోర్డర్ తో కలిసున్నాయని ఇప్పటికే నలభై మూడు లక్షల క్యాష్, లిక్కర్ ను కూడా సీజ్ చేయటం జరిగిందని ఎస్పీ తెలిపారు.
అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వస్తున్న ఉదంతుల నేపథ్యంలో ఎస్పీ మాట్లాడుతూ, తాము ఎవరికీ కొమ్ము కాయడం లేదని, నిజం నిప్పులాంటిదని, తాము పారదర్శకంగా ఉంటున్నామని తెలిపారు. తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వెంకటేశ్వరులు అన్నారు.