English | Telugu
Eto Vellipoyindhi Manasu : పోలీస్ స్టేషన్ లో నమిత నిజం చెప్పగలదా!
Updated : Aug 9, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -170 లో......ఎన్ని రోజులు అని ఇక్కడ దాక్కోవాలి.. శ్రీలత గారితో చెప్పి నన్ను పంపించమని చెప్పాలని నమిత అనుకుంటుంది. అప్పుడే రామలక్ష్మి రావడం నమిత చూసి.. ఈవిడ ఎందుకు ఇలా వస్తుంది. తనకి నేను కన్పించొద్దని నమిత అనుకుంటుంది. అప్పుడే రామలక్ష్మి వచ్చి డోర్ తియ్యమని అడుగుతుంది. ఎవరు డోర్ తియ్యకపోవడంతో కావాలనే ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నమిత కి వినపడేలా రామలక్ష్మి అంటుంది. దాంతో రామలక్ష్మి వెళ్ళిపోతుందని నమిత హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత రామలక్ష్మి కార్ దగ్గరికి వెళ్ళగానే కొందరు రౌడీలు లోపలికి వెళ్లడం రామలక్ష్మి చూస్తుంది. వాళ్ళు నమిత డోర్ తియ్యండి సందీప్ సర్ పంపించారని అనగానే నమిత డోర్ తీస్తుంది. మళ్ళీ రామలక్ష్మి డోర్ దగ్గరికి వచ్చి వాళ్ళ మాటలు వింటుంది. ఆ రౌడీలు ఒక పేపర్ ఇచ్చి ఇందులో సంతకం చెయ్యమని చెప్పారు. అందులో మేమ్ చెప్పింది రాయండి.. సీతాకాంత్ సర్ చేసిన అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాయి అని చెప్తారు. నేను రాయను .. ఎందుకు ఇలా రాయమంటున్నారని నమిత అంటుంది. ఎందుకంటే శ్రీలత మేడమ్ మిమ్మల్ని చంపేమన్నారని రౌడీలు చేప్తారు. ఆ మాటలు విన్న రామలక్ష్మి.. ఇక సీతా సర్ ని బయటకూ రాకుండా చేయడానికి చేస్తున్నారని అనుకుంటుంది. మరొకవైపు రౌడీలు నమితని బయపెడుతుంటే రామలక్ష్మి లోపలికి వెళ్లి.. వాళ్లపై స్ప్రే కొట్టి నమితని తీసుకొని బయటకు వస్తుంది.
ఆ తర్వాత ఆ రౌడీలు సందీప్ కి ఫోన్ చేసి.. నమితని ఒక అమ్మాయి సేవ్ చేసింది తప్పించుకుందని చెప్తారు. అప్పుడే శ్రీలత తీసుకొని.. ఆ నమిత బ్రతడానికి వీలు లేదని చెప్తుంది. మరొకవైపు రామలక్ష్మి నమితతో మాట్లాడుతుంది. నేను తప్పు చేశాను మేడమ్.. దాన్ని సరిదిద్దుకుంటానని నమిత అంటుంది. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలని రామలక్ష్మి అంటుంది. అప్పుడే రౌడీలు చూసి వెంబడిస్తారు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి రౌడీ లకి గన్ చూపించి బెదిరించి రామలక్ష్మి నమితలని సేవ్ చేస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి, నమితలు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. సర్ తప్పు చేయలేదు.. తప్పు అంతా నాది.. అసలు ఎందుకు ఇదంతా చేసానో చెప్తానని నమిత అంటుంది. అప్పుడే శ్రీలత, సందీప్ లు వస్తారు. వాళ్ళని చూసిన నమిత ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.