English | Telugu

Guppedantha Manasu Jyothi rai : బిగ్ బాస్ ఆఫర్ కి నో చెప్పేసిన జ్యోతిరాయ్!

ఇదేందయ్యా ఇది.. ఎవరైన బిగ్ బాస్ ఆఫర్ ని‌ రిజెక్ట్ చేస్తారా.‌. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న జ్యోతి రాయ్ అదే చేసింది. తనని బిగ్ బాస్ కి రమ్మని కన్నడ బిగ్ బాస్ మేకర్స్ ఆఫర్ చేసినప్పుడు తను సున్నితంగా తిరస్కరించింది. అదే విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది ఈ భామ.

కొంతకాలం క్రితం తన వీడియో ఒకటి‌ లీక్ అయిందంటూ అటు సోషల్ మీడియాలో, ఇటు న్యూస్ ఛానెల్స్ లో మోత మోగించారు. ఆ తర్వాత తను అలాంటివాటికి దూరంగా ఉంటూ మాములు లైఫ్ ని లీడ్ చేస్తోంది. కన్నడ పరిశ్రమ నుంచి జ్యోతిరాయ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దాదాపు 20కిపై సీరియల్స్‌లో నటించిన జ్యోతిరాయ్‌ ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతిగా తల్లి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకోబోతోందన్న వార్త వైరల్‌గా మారింది. 20 ఏళ్ళ వయసులోనే పద్మనాభం అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్న 38 సంవత్సరాల జ్యోతి రాయ్‌ అతనితో కొన్నాళ్ళు కాపురం చేసింది. వారికి ఒక బాబు. కారణాలు తెలియవు కానీ అతనికి ఇప్పుడు దూరంగా ఉంటోంది తెలిసింది.

గత కొంతకాలంగా యంగ్‌ డైరెక్టర్‌ సుకు పుర్వాజ్‌ను జ్యోతి పెళ్ళి చేసుకోబోతోందని రూమర్లు వచ్చాయి. ఇద్దరూ రిలేషన్‌లో వున్నారని వారు పోస్ట్‌ చేస్తున్న ఫోటోల ద్వారా తెలిసింది. కొన్ని రోజుల క్రితం తను‌ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తనని కన్నడ బిగ్ బాస్ టీమ్ కలిసినట్టు చెప్పింది. అయితే అందులోకి తను వెళ్ళడం లేదని, తనకు వేరే సినిమా షూటింగ్ , ఇంకా కొన్ని అగ్రిమెంట్లు ఉన్నాయంటు ఇందులో రాసుకొచ్చింది. తనని అప్రోచ్ అయినందుకు థాంక్స్ అంటూ తనని ఇంతలా ఆదరస్తున్న అభిమానులకి థాంక్స్ చెప్పుకొచ్చింది జ్యోతి రాయ్.