English | Telugu
Guppedantha Manasu : బోర్డ్ మీటింగ్ లో రిషి ఏం చెప్పనున్నాడు!
Updated : Aug 9, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1148 లో.... వసుధార తన క్యాబిన్ లో కూర్చొని ఫైల్స్ చూస్తుంటుంది. అందులో మిస్టెక్స్ ఉండడంతో లెక్చరర్ ని పిలిచి మాట్లాడుతుంది. మను గారు రిజైన్ చేసి వెళ్ళాక.. ఏం చెయ్యాలో తెలియక ఆ వర్క్స్ అన్ని అలాగే ఉండిపోయాయంటూ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ ఫైల్ ని పాస్ చేస్తున్నాను త్వరగా వర్క్ ఫినిష్ అవ్వాలంటూ వసు ఫైల్ పై సంతకం పెడుతుంటే.. అప్పుడే శైలేంద్ర వస్తాడు.
ఏంటి వసుధార నువ్వు ఇప్పుడు ఏమైనా ఎండీవా సంతకం పెడుతున్నావ్.. నీకు ఏ అధికారం ఉందని పెడుతున్నావని అంటాడు. అప్పుడే రిషి వస్తాడు. ఇప్పుడు కాలేజీకి ఎండీ వసుధార కాదు అయిన ఇప్పుడు తను సంతకం చెయ్యడం కరెక్ట్ అంటావా రిషి అని శైలేంద్ర అడుగుతాడు. అవును వసుధార నువ్వు చెయ్యొద్దని రిషి అంటాడు. నువ్వే ఇక ఎండీ ఎవరో నిర్ణయం తీసుకొవాలి రిషి అని శైలేంద్ర అనగానే.. సరే బోర్డు మీటింగ్ అరెంజ్ చేసి చెప్తానంటూ రిషి బయటకు వస్తాడు. వెనకాలే శైలేంద్ర వచ్చి ఏంటి నా పేరు చెప్పలేదని అడుగుతాడు. రిషి అంత త్వరగా మీ పేరు చెప్తాడా.. అందుకే బోర్డు మీటింగ్ అన్నాను.. లేదంటే వసుధారకి డౌట్ వస్తుంది కదా అని రిషి అంటాడు. వీడు బానే యాక్ట్ చేస్తుండని శైలేంద్ర అనుకుంటాడు.ఆ తర్వాత ఏంజిల్ రిషి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే శైలేంద్ర చూసి.. వీడికి ఏంజిల్ గురించి చెప్పలేదు కదా ఎలా మాట్లాడుతున్నాడని శైలేంద్ర అనుకుంటాడు. అపుడే రిషి చూసి కావాలనే.. ఈవిడ ఎవరు ఈవిడ గురించి చెప్పలేదు.. ఫ్రెండ్ అంటుంది .. ఏదో మేనేజ్ చేస్తున్నానని శైలేంద్రకి మెసేజ్ చేస్తాడు రిషి. ఆ తర్వాత ఏంజిల్ దగ్గరికి శైలేంద్ర వచ్చి మాట్లాడుతాడు. వసుధార దగ్గరికి ఏంజిల్, రిషి వెళ్తారు. మను గారు రాలేదా అని వసుధార అడుగుతుంది. ఒకసారి ఫోన్ చెయ్ మాట్లాడుతానని వసుధార అనగానే ఏంజిల్ ఫోన్ చేస్తుంది.
మనుతో వసుధార మాట్లాడుతుంది. ఏంటి మను గారు రాలేదు.. మీ తండ్రి గురించి తెలిసిందా అని అడుగుతుంది. ఆది వదిలెయ్యండి మేడమ్.. టైమ్ వచ్చినప్పుడు మా అమ్మ చెప్తానంది అని మను అంటాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది మీరు మాట్లాడుకోండి అంటూ వసుధార బయటకు వస్తుంది. నాకు నేను వెళ్లిపోయినా రోజు.. నా క్యాబిన్ సీసీ టీవీ ఫుటేజ్ కావాలని వసుధార ఎవరరికో కాల్ చేస్తుంది. ఆ తర్వాత శైలేంద్ర, దేవయాని దగ్గరకి వచ్చి ఎండీ పదవికి ఒక్క అడుగు దూరంలో ఉన్నానని అంటాడు. మరి ఆ తర్వాత రంగాని ఏం చేస్తావని దేవయాని అడుగగా.. లేపేస్తానని శైలేంద్ర అంటాడు. అప్పుడే ధరణి.. ఏం మాట్లాడుకుంటున్నారంటూ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.