English | Telugu
Karthika Deepam2 : మరదలిపై కార్తీక్ ఫైర్.. కోర్టులో గెలిచేదెవరు?
Updated : Aug 10, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -119 లో....నువ్వు ఇక్కడే ఉండు బూచోడు వస్తాడని శౌర్య భయపడుతుంటే రాడని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న ఎక్కడ అని సుమిత్రని అడుగుతాడు. గదిలో ఉందని సుమిత్ర చెప్పగానే.. కోపంగా జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు కార్తీక్. అసలు నీకు బుద్ది ఉందా చిన్నపిల్లలతో అలాగేనా మాట్లాడేదంటు కార్తీక్ కోప్పడతాడు. నీకు కాబోయే భర్తగా ఏదైనా అనే హక్కు నీకుంది.. కానీ వాళ్ళ విషయంలో అనే రైట్ లేదని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్నపై కార్తీక్ చెయ్ ఎత్తుతాడు.
వాళ్ల గురించి నువ్వు ఎందుకు అంతలా అవుతున్నావని జ్యోత్స్న అంటుంది. దీప గురించి నీకెందుకని అడుగగా.. శౌర్యకి ఫ్రెండ్ ని, దీపకి శ్రేయోభిలాషిని అని కార్తీక్ అంటాడు. రేపు ఎలాగైనా నరసింహా తన కూతురిని తీసుకొని వెళ్తాడని జ్యోత్స్న అంటుంది. శౌర్య బాధపడేలా మాట్లాడితే మర్యాదగా ఉండదంటూ జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే సుమిత్ర వస్తుంది. అందరూ ఇలాగే ఉన్నారు.. అర్థం చేసుకునేవాళ్లు లేరు.. ఎవరి ఇష్టానికి వాళ్లు మాట్లాడి బాధపెడతారు. అక్కడ అమ్మ కూడా అంతే.. ఒక నువ్వే అత్త అర్థం చేసుకునేది.. నీ కడుపున ఈ ఆవేశపరురాలు ఎలా పుట్టిందో.. నువ్వు అయినామన తనకి చెప్పు అత్త అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత అనసూయ కోర్టులో జరిగింది గుర్తుకుచేసుకుంటుంది. అప్పుడే నరసింహా, శోభ వస్తారు.
అమ్మ రేపు కోర్టులో మనమే గెలుస్తాం.. నా కూతురు ఇక్కడికి వస్తుందని నర్సింహా అంటాడు
రేపు నేను కోర్టుకి రానని అనసూయ అంటుంది. శౌర్యా వచ్చాక షాపింగ్ కి వెళదాం.. తన పేరు మారుస్తానని శోభ మురిసిపోతుంది. కూతురిని అడిగితే ఇవ్వలేదని, ఇంత పెద్ద నిందలు వేస్తున్నాడు.. ఇప్పుడు విడాకులు అడిగితే ఏం చేస్తాడో.. అయినా తప్పదు నా కూతురు కోసం తప్పదని దీప అనుకుంటుంది. కార్తీక్ కూడా దీప గురించి బాధపడతాడు. కార్తీక్ అన్న మాటలకు జ్యోత్స్న కోపంగా ఉంటుంది. మరుసటిరోజు ఉదయం కోర్టులో దీప దగ్గరికి నరసింహా వచ్చి మాట్లాడతాడు. కాసేపటికి పారిజాతం, జ్యోత్స్నలు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.