English | Telugu
నంబి నారాయణ్ తో పూనమ్ కౌర్...చేనేత వస్త్రాల బహూకరణ
Updated : Aug 10, 2024
పూనమ్ కౌర్ మూవీస్ లో నటించకపోయినా కానీ ఏపీ రాజకీయాలతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. ఐతే పూనమ్ రీసెంట్ గా జాతీయ చేనేత దినోత్సవాన్ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. చేనేత వస్త్రాలను ధరించిన ఆమె ఆ డ్రెస్సింగ్ స్టైల్ లో డిఫరెంట్ గా కనిపించి అదరగొట్టారు. ఐతే ఆమె రీసెంట్ గా ఈ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ ని కలిశారు. ఆయన కోసం కొన్ని చేనేత వస్త్రాలను తీసుకెళ్లారు. ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. "ఏపీ నుండి ప్రత్యేక చేనేత వస్త్రాలు ఆయన కోసం తీసుకెళ్ళాను.
పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ గారిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఒక గంట పాటు ఎన్నో విషయాలు మాట్లాడారు. చిన్నతనంలో, మహాభారతం, రామాయణం వంటి పురాణ ఇతిహాసాల్లో చెడుపై మంచి విజయం ఎలా సాధించిందో వంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నా. నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఇంచుమించు అలాగే ఉంటుంది, ఈ లివింగ్ లెజెండ్‌ను కలుసుకోవడం ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను.. కష్ట సమయాల్లో, ఎలా మన మాటకు, మన నడతకు కట్టుబడి ఉండాలో ఆయన్ని చూస్తే అర్ధమవుతుంది. ఆయన షేర్ చేసుకున్న ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి. ఆయన ఈ దేశానికి హీరో... నిజమైన దేశభక్తుడు" అంటూ రాసుకొచ్చింది..పూనమ్ గతంలో ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. చేనేత వస్త్రాలు, పరిశ్రమలకు తగిన గుర్తింపు తెచ్చేందు