English | Telugu

ఇండియన్ అనాబెల్ అంటూ మంజునాథ్ ని పొగిడిన బ్రిట్టో


ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ మాన్సూన్ స్పెషల్ గా తీసుకొచ్చారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా డాన్సర్ బ్రిట్టో-సంధ్య, అలాగే లాస్య-మంజునాథ్ వచ్చారు. ఇక మాన్సూన్ స్పెషల్ కాబట్టి కూల్ టెంపరేచర్ హీటెక్కించే డాన్సులు కూడా చేయించింది శ్రీముఖి. అలాగే తర్వాత ఇంకో టాస్క్ ఇచ్చింది. అదేంటంటే భార్యలతో భర్తలకు మేకప్ చేయించారు. మాములుగా కూడా భార్యల వెనక భర్తల్ని కూర్చోబెట్టి వాళ్ళ ముఖాలు చూడకుండా మేకప్ చేసే కాన్సెప్ట్ అన్నమాట. అలా అందరూ మేకప్ చేశారు.

ఇక లాస్య మాత్రం మంజునాథ్ ని ఒక రేంజ్ లో మేకప్ చేసింది. చూస్తే భయమేసేలా చేసింది. అలాగే సంధ్య కూడా బ్రిట్టోకి అలాగే మేకప్ చేసింది. బ్రిట్టో మంజునాథ్ మేకప్ ని చూసి షాక్ అయ్యాడు. అంతే కాదు లాజీ కూడా అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అలాగే బ్రిట్టో మంజునాథ్ కి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. మంజునాథ్ చూడడానికి "ఇండియన్ అనాబెల్" లా ఉన్నాడు అని అన్నాడు. అనాబెల్ అంటే ఒక హారర్ మూవీలో ఉండే బొమ్మ. దాని పేరే అది. ఆ కామెంట్ కి లాస్య పడీపడీ నవ్వేసింది. ఇక ఫైనల్ గా సీరియల్ హజ్బెండ్స్ తో సీరియల్ వైప్స్ కి జాడలేయించి మల్లెపూలు పెట్టించింది శ్రీముఖి.