English | Telugu

అన్‌స్టాపబుల్ సీజన్ 4.. గెస్ట్ ల లిస్ట్ చూస్తే మతిపోతుంది!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే" (Unstoppable With NBK) షోకి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారమయ్యే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. మూడు ఎపిసోడ్లకు సంబంధించి మొత్తం 22 ఎపిసోడ్లు విడుదల కాగా, అన్ని ఎపిసోడ్లు పెద్ద హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు నాలుగో సీజన్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ కి ముహూర్తం ఖరారైంది. దసరా కానుకగా అక్టోబర్ నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈసారి గెస్ట్ ల లిస్ట్ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడు సీజన్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రాజమౌళి ఇలా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, నాగార్జున వంటి వారు హాజరు కానున్నారని అంటున్నారు. అంతేకాదు 'దేవర' ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కూడా హాజరయ్యే ఛాన్స్ ఉందని టాక్.