English | Telugu

Brahmamudi : బ్యాచిలర్ రూమ్ లో కొత్త దంపతులు.. ధాన్యలక్ష్మి కన్నీళ్ళు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -484 లో......దుగ్గిరాల కుటుంబం మొత్తం హాల్లో కూర్చొని ఉంటారు. జరిగిన విషయం గుర్తు చేసుకొని బాధపడుతుంటారు. అప్పుడే రుద్రాణి.. ఇందులో బాధపడడానికి ఏముందో.. అనుకున్నదే జరిగింది కదా అని అంటుంది. ఆ కనకం అనుకున్నది చేసింది.. తన కూతుళ్లని ఈ ఇంటికి కోడళ్ళు చేసిందని రుద్రాణి అంటుంది. ఏది అయితే జరగకూడదనుకున్నానో అదే జరిగింది.. స్నేహం అంటూ తిరిగి ఈ తల్లికి ద్రోహం చేసాడని ధాన్యలక్ష్మి బాధపడుతుంది.

ఎందుకు ఏడుస్తున్నావ్ నీ మనసు ఉంది చెప్పాలని చూసావ్ కానీ వాడి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. తను ప్రేమించిన అమ్మయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడని ప్రకాష్ అనగానే.. ఎలా బ్రతుకుతాడు, అప్పు అనేది పరిచయం అయిన నుండి వాడికి అన్ని కష్టాలే అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇదంతా కావ్య, స్వప్న కనకం వల్లేనని రుద్రాణి అంటుంది‌ దాంతో స్వప్న, కావ్యలు రుద్రాణి పై విరుచుకుపడుతారు. ఇద్దరు ప్రేమిస్తున్న విషయం చెప్పకపోవడం వాళ్ళ తప్పు అని ఇందిరాదేవి అంటుంది. ఇష్టం లేదని అంటూనే నా కొడుకుని అప్పుకి అప్పజెప్పారు.. నా ఒక్క కొడుకు దూరంగా వెళ్ళిపోయాడు‌‌. ఇప్పుడేం సమాధానం చెప్తారని రాజ్, కావ్యలని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంకేంటి రాజ్ ని కావ్య కొంగున ముడేసుకున్నట్లు.. ఇక నీ కొడుకుని కూడా అప్పు అలాగే చేసి నీ దగ్గరికి రాకుండా చేస్తుందని రుద్రాణి అనగానే.. అపర్ణ కోప్పడుతుంది. నువ్వు పరాయి దానివి అని అపర్ణ రుద్రాణిని అనగానే.. ఏం అన్నావంటూ రుద్రాణి అంటుంది. అవును మరి ఏదో భర్తని వదిలేసి వస్తే నా కొడుకులు వాళ్ళలో కలుపుకున్నారు.. వాళ్ళలో విబేధాలు స్పృష్టించాలని చూస్తే నువ్వెవరు మేమ్ ఎవరు అని ఇందిరాదేవి అనగానే.. రుద్రాణి, రాహుల్ లు కోపంగా పైకి వెళ్తారు.

మరొకవైపు కనకం, కృష్ణమూర్తిలు అప్పు, కళ్యాణ్ లు వెళ్ళిపోయినందుకు బాధపడతారు. ఆ తర్వాత కళ్యాణ్ ని తీసుకొని అప్పు తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు అప్పుని చీరలో చూసి నవ్వుకుంటారు. ఆ తర్వాత బావ అంటూ కళ్యాణ్ ని లోపలికి పిలుస్తారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. తరువాయి భాగంలో అప్పు , కళ్యాణ్ లని ఇంటికి తీసుకొని రావాలి.. లేదంటే నీ మాట నేనెందుకు వింటానని కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.