English | Telugu

Brahmamudi :  అప్పు, కళ్యాణ్ ల కొత్త కాపురం.. కావ్య ఇంటికి తీసుకొస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -483 లో....రాజ్ తాళి తీసుకొని వచ్చి ఇవ్వగానే కళ్యాణ్ అప్పు మెడలో తాళి కడతాడు. దాంతో నాకు ఇష్టం లేకుండా ఎందుకు తన మెడలో తాళి కట్టావ్.. తల్లి తండ్రి మాట అంటే లెక్క లేదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నీ వల్ల వాళ్ళు ఎక్కడ మాట పడాల్సి వస్తుందోనని నన్ను అందరు నన్ను దూరం పెట్టారని కళ్యాణ్ అంటాడు. అప్పు నీపై జాలితో కాదు నీపై ప్రేమ తో మనస్ఫూర్తిగా నీ మెడలో తాళి కట్టానని కళ్యాణ్ అంటాడు. భగవంతుడి సమక్షంలో మనకి బ్రహ్మముడి పడింది అని కళ్యాణ్ అంటాడు.

నేను ఈ పెళ్లికి ఒప్పుకోను.. నాకు ఇష్టం లేకుండా అది ఈ ఇంటికి కోడలుగా ఎలా వస్తుందో చూస్తానని ధాన్యలక్ష్మి అప్పు తాళి తెంచబోతుంటే.. ప్రకాష్ వచ్చి ధాన్యలక్ష్మి చెంప చెల్లుమనిపిస్తాడు. ఇదే పని అప్పుపై నువ్వు నిందలు వేసినప్పుడు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రకాష్ అంటాడు. అదేంటి కన్నతల్లికి ఆ మాత్రం హక్కు లేదా అని రుద్రాణి అనగానే.. నువ్వు నోరు ముయ్.. ఆడపడుచు హోదా ఇచ్చాము కదా అని ఇంట్లో ఉండి చిచ్చు పెడతావా.. నిన్ను నీ కొడుకుని బయటకు గెంటేస్తానని రుద్రాణితో సుభాష్ అంటాడు. అప్పుడు స్వప్న కూడా మాతో వస్తుందని రుద్రాణి అనగానే.. నాకేం అవసరం, తాతయ్య ఇచ్చిన ఆస్తి బోలెడు ఉందని స్వప్న అంటుంది. ఎందుకు ఇలా చేసావ్ కళ్యాణ్.. నిన్ను ఎన్నిసార్లు అడిగాను.. అంటే అబద్దం చెప్పి నన్ను మోసం చేశావా? ఇప్పుడు నా చెల్లిని మోసం చేశావా? నేను మీ పెళ్లి జరగద్దని అనుకున్నాను.. ఎందుకంటే అందరు వేసిన నిందలు నిజమని నమ్ముతారు.. అందుకే అనామికతో విడాకులు తీసుకొని అప్పుని పెళ్లి చేసుకున్నాడని అనుకుంటారని కావ్య అంటుంది. ఇప్పుడు ధాన్యలక్ష్మి గారు నా చెల్లిని కోడలుగా ఒప్పుకుంటారా.. టార్చర్ చూపిస్తారని కావ్య అంటుంది.

నేనొక నిర్ణయం తీసుకున్నాను.. నేను అప్పుని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఎప్పుడు రానని కళ్యాణ్ అనగానే వద్దని రాజ్ అంటాడు. మా ఇంటికి రండీ బాబు అని కనకం , కృష్ణమూర్తి అంటారు. నేను రానని కళ్యాణ్ చెప్పి.. నా భార్యని పోషించగలనని కనకం కృష్ణమూర్తి గార్ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. కాసేపటికి అప్పు, కళ్యాణ్ లు వెళ్లిపోతారు. ఆ తర్వాత కళ్యాణ్ అప్పు ని బ్రో అంటాడు. ఇప్పుడు కూడా అలాగే అంటావారా అని అప్పు అనగానే.. మరి నువ్వు కూడ అలాగే ఉంటావా అంటూ ఇద్దరు నవ్వుకుంటారు. ఆ తర్వాత కళ్యాణ్ తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. షెల్టర్ కోసం తను అమెరికాలో ఉన్నానని హౌస్ లీజ్ కి ఇచ్చానని చెప్పగా.. ఒక దారి ఉంది అంట.. కళ్యాణ్ ని తీసుకొని అప్పు వెళ్తుంది. ఆ తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం హాల్లో కూర్చొని జరిగింది గుర్తుచేసుకుంటారు. తరువాయి భాగంలో నువ్వు , రాజ్ కలిసి నా కొడుకుని అప్పుకి అప్పజెప్పారని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వే ఎలాగైనా కళ్యాణ్ అప్పులని ఇంటికి తీసుకొని రావాలని కావ్యకి రాజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.