English | Telugu

Guppedantha Manasu : రిషిపై బుజ్జీకి డౌట్.. శైలేంద్ర ఆ పని చేస్తాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1149 లో....దేవయాని, శైలేంద్ర లు మాట్లాడుకుంటారు. రంగాతో పని అయ్యాక వాడిని లేపేస్తానని శైలేంద్ర అంటాడు. అప్పుడే ధరణి వచ్చి.. ఏం మాట్లాడుకుంటున్నారంటూ చిరాకుపడుతుంది. ఆ తర్వాత వసుధార సీసీటీవీ ఫుటేజ్ కోసం ఫోన్ చేయగా.. వాళ్ళు మెయిల్ చేశామని చెప్తారు. ఆ తర్వాత వసుధార మెయిల్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో శైలేంద్ర క్యాబిన్ కి వచ్చి.. వసుధార రాసిన లెటర్ తీసుకొని వెళ్లినట్టు ఉంటుంది. అది చూసి నేను ఉహించిదే నిజం అయిందని వసుధార అనుకుంటుంది.


అప్పుడే రిషి వచ్చి ఏంటి అది అని అడుగుతాడు. వసుధార ఆ వీడియో క్లోజ్ చెయ్యడంతో.. ఏంటి అది నేను చూడకూడనిదా అని అడుగగా... లేదని వసుధార వీడియో చూపిస్తుంది. అది చూసి.. ఏంటి అన్నయ్య లెటర్ తీసుకున్నాడు. అందులో ఏముందని అడుగుతాడు. అది మను గారికి సంబంధించిన విషయం. అది తనకి తప్ప ఎవరికి తెలియొద్దని వసుధార అంటుంది. అప్పుడే రిషికి బుజ్జి ఫోన్ చేస్తాడు. నానమ్మకి ఆపరేషన్ చెయ్యాలన్నారు.. చాలా డబ్బులు అవుతాయని బుజ్జి అనగానే.. నేను చూసుకుంటానని రిషి అంటాడు. నానమ్మ కంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయి అన్నా.. నువ్వు రంగావా రిషివా అని బుజ్జి అడుగుతాడు. నీకు డౌట్ ఎందుకు వచ్చిందని రిషి అంటాడు. వసుధార మేడమ్ అంటే నమ్మలేదు కానీ అన్నీ తనకి ఇష్టం అయినట్టు చేస్తావ్.. ఆ రోజు నువు రింగ్ ఇచ్చి మేడమ్ కి ఇవ్వమన్నప్పుడే డౌట్ వచ్చింది.. చెప్పన్న నువ్వు రిషివా అని బుజ్జి అనగానే.. టైమ్ వచ్చినప్పుడు తెలుస్తుందని రిషి అంటాడు. మరొకవైపు శైలేంద్రతో వసుధార మాట్లాడుతుంది. నేను రాసిన లెటర్ ఎందుకు తీసుకున్నావ్.. లెటర్ ఇవ్వమని తిడుతుంది. నేను ఇవ్వనని వసుధారపై శైలేంద్ర కోప్పడుతుంటే.. అప్పుడే రిషి వస్తాడు. ఏంటి అన్నయ్య నా భార్య పై అరుస్తున్నావని అనగానే.. శైలేంద్రకి డౌట్ వస్తుంది. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత రిషి వెళ్ళిపోయాక ఆ లెటర్ ని మనుకి నేను ఇస్తానని శైలేంద్ర అనగానే.. ఇస్తే ఇవ్వు నీకే నష్టం మావయ్య, మనులు ఒకటి అవుతారని వసుధార చెప్పి వెళ్ళిపోతుంది. అవును వసుధార అన్నది కూడా నిజమే అని శైలేంద్ర అనుకుంటాడు.

ఆ తర్వాత రాధమ్మ రంగా గురించి టెన్షన్ పడుతుంటే.. అప్పుడే సరోజ నేను బావకి ఫోన్ చేస్తానంటూ చేస్తుంది. వసుధార లిఫ్ట్ చేస్తుంది. నా బావకి ఇవ్వు అనగానే.. రిషి సర్ ఇక్కడ లేడని వసుధార అంటుంది. నీ సంగతి అక్కడికి వచ్చి చెప్తానని సరోజ అంటుంది. ఆ వసుధారనే బావని తీసుకొని వెళ్ళిందని సరోజ అంటుంది. మరొకవైపు అనుపమ దగ్గరికి వసుధార వెళ్తుంది. అసలు ఏం జరిగిందని అడుగుతుంది. మను మహేంద్ర కొడుకు అని దేవయానికి తెలిసిందని అనుపమ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.