English | Telugu
Eto Vellipoyindhi Manasu : భార్యని అలా హత్తుకొని థాంక్స్ చెప్పాడు.. ఇదేనా అసలు బంధం!
Updated : Aug 10, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -171 లో....రామలక్ష్మి నమితని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వస్తుంది. సీతాకాంత్ సర్ ఏం తప్పు చెయ్యలేదు.. అంత నేనే చేశాను అసలు ఏం జరిగిందో చెప్తానని నమిత ఇన్స్పెక్టర్ తో అంటుంది. అప్పుడే సందీప్, శ్రీలతలు వస్తారు. వాళ్ళను చూసి నమిత ఆగిపోతుంది. నా కొడుకు ఏం తప్పు చేయకుండా ఇలా నిందలు వేసావంటూ ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే నమిత పేరెంట్స్ తన రౌడీల దగ్గర ఉన్న ఫోటోని పంపిస్తుంది. అది చూసి నమిత టెన్షన్ పడుతుంది.
ఆ తర్వాత నమిత అదంతా శ్రీలత సందీప్ లు చేశారని కాకుండా నేనే డబ్బులు కోసం ఇలా చేశానని చెప్తుంది. ఏంటి అలా చెప్తున్నావ్ దీని వెనకాల ఎవరున్నారో చెప్పమని రామలక్ష్మి అంటుంది. నేనే చేసానంటూ వాళ్ళకి భయపడి నమిత అలా చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ ని సెల్లో నుండి బయటకు తీసుకొని వస్తారు. అసలు ఇదంతా ఎందుకు చేసావని సీతాకాంత్ అంటాడు. నేనే తప్పు చేశాను ఎంత పెద్ద తప్పు చేసానో రామలక్ష్మి మేడమ్ చెప్పారు.. అందుకే కేసు వెనక్కి తీసుకుంటున్నానని నమిత అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ పై శ్రీలత ప్రేమ నటిస్తూ ఉంటుంది. సీతాకాంత్ కాళ్ళ మీదపడి క్షమించని అడుగుతాడు సందీప్. నువ్వు బయటకు వస్తే గుడికి వస్తానని మొక్కుకున్నా.. వెళ్లి వస్తానంటూ శ్రీలత, సందీప్ లు వెళ్తారు. ఆ తర్వాత రామలక్ష్మికి సీతాకాంత్ థాంక్స్ చెప్తాడు. నన్ను బయటకు తీసుకొని వచ్చవంటూ ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. అదంతా రామలక్ష్మి, నమితలని కాపాడిన అమ్మాయి చూస్తుంటుంది.
మరొక వైపు ఇంట్లో రామలక్ష్మి వదిన కన్పించడం లేదని సిరి అంటుంది. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్ లు వస్తుంటారు. సిరి వెళ్లి సీతాకాంత్ ని హగ్ చేసుకుంటుంది. అనుకున్నది చేసావ్ అమ్మ అని పెద్దాయన అంటాడు. అప్పుడే శ్రీలత, సందీప్ లు వస్తారు. ఇన్‌స్పెక్టర్ తో మాట్లాడి సీతాకాంత్ ని తీసుకొని వస్తానని సందీప్ ని తీసుకొని వెళ్ళాను. అప్పుడే రామలక్ష్మి, నమితని తీసుకొని వచ్చి నిజం చెప్పించిందని శ్రీలత అంటుంది. వెళ్లి హారతి ఇవ్వండి అనగానే.. నేనే ఇస్తా అని శ్రీలత అంటుంది. వద్దు మీకెందుకు శ్రమ నేనే తీస్తానంటు సీతాకాంత్ కి రామలక్ష్మి హారతి ఇస్తుంది. ఆ తర్వాత అత్తయ్య మీతో మాట్లాడాలని శ్రీలతతో రామలక్ష్మి అంటుంది. ఇక మీ ప్రయత్నం ఆపండి అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.