Read more!

English | Telugu

కార్తీకదీపం2 లో మోనితని చూశారా!

కార్తీక దీపం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిరీక్షణకి తెరపడింది.. ఆ తరుణం రానే వచ్చింది. పార్ట్ టూ స్టార్ మాటీవీలో రేపటి నుండే మొదలవుతుంది. అయితే ఈ సీరియల్ కొంగొత్తగా నవ వసంతంగా రానుంది. అంటే కొత్త పుంతలతో, కొత్త క్యారెక్టర్లతో కొత్త కథతో రానుంది.

కార్తీకదీపంలో దీప, కార్తీక్ లు ఎప్పుడు కలుస్తారా అన్న క్యూరియాసిటితో తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది దాదాపు ఆరేళ్ళు సంవత్సరాల పాటు ఎదురుచూసారు. అంత ఎమోషనల్ బాండింగ్ ఉన్న సీరియల్ రేపటి నుండి స్టార్ మా టీవీలో రాత్రి ఎనిమిది గంటలకు మొదలవుతుంది. ఇందులో కార్తిక్ అలియాస్ అనుపమ్ పరిటాల ఓ గొప్పింటి వాడిలా, దీప అదే ఇంట్లో వంటలక్కలా పరిచయం చేశారు. కార్తీకదీపం సీరియల్‌కి డాక్టర్ బాబూ, వంటలక్క, మోనిత ఈ మూడు పాత్రలూ మూల స్తంభాలు. జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్‌గా కార్తీకదీపం ఆరేళ్లు పాటు నిర్విరామంగా వెలుగుతూనే ఉందంటే.. ఈ ముగ్గురి నటనే మూలం. తమిళ్‌లో సూపర్ హిట్ సీరియల్‌గా నిలిచిన చెల్లెమ్మ సీరియల్‌ని మార్పులు చేర్పులతో ‘కార్తీకదీపం 2’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారు. అయితే దీప, కార్తీక్‌లు ఉన్నారు కాబట్టి.. మోనిత పాత్ర కోసం కూడా చాలామంది పట్టుపడుతున్నారు కార్తీకదీపం ఫ్యాన్స్. అయితే ఈ ‘కార్తీకదీపం నవ వసంతం’ కథలో కూడా మోనిత లాంటి లేడీ విలన్ ఉండబోతుంది.

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం.. చేరనీ నీ పాద పీఠం అంటూ సాగే కార్తీకదీపం సీరియల్ పాట రాగానే మన ఇంటిపక్కవాళ్ళకి కూడా అర్థమైపోతుంది‌. అంతలా అందరిలో కలిసిపోయిన కార్తీకదీపం మొదటి పార్ట్ లోని ఈ పాటనే రెండవ పార్ట్ లోను ఉంచేశారు. అయితే ఈ పాటలో మన మోనితలాగా కొత్త క్యారెక్టర్ కన్పించింది. కార్తీక్ వైపు ఓరగా చూస్తూ పాట అందుకుంది. దీప, శౌర్యలు పూలు తీసుకొచ్చి దేవుడికి అభిషేకిస్తూ పాట పాడేసింది. తాజాగా స్టార్ మా టీవీ యూట్యూబ్ ఛానెల్ లో వచ్చిన ఈ సాంగ్ ప్రోమో అందరిని ఆకట్టుకుంటుంది.