English | Telugu

అవినాష్,అనిల్, శ్రీకర్ అమ్మాయిల్లా ఎలా ఉంటారో తెలుసా!


ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈవారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఈ వారం కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండస్ట్రీ సీనియర్స్ వెర్సెస్ బ్లాక్ బస్టర్ జూనియర్స్ థీమ్ నడిచింది. ఈ షోలో శ్రీముఖి ఒక ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ ని చూపించింది. యాక్టర్స్ గనక అమ్మాయిల్లా పుడితే ఎలా ఉంటారో చూపించింది. అవినాష్ అమ్మాయిలా పుడితే ఎలా ఉంటాడో ఒక పిక్ ని ప్లే చేయించింది. అవినాష్ అమ్మాయి పిక్ ని హాఫ్ మాత్రమే చూపించేసరికి సీనియర్ నటుడు అనిల్ వెంటనే ఫుల్ పిక్చర్ లేదా అని అడిగాడు. ఆయన మనసులో అంతరార్ధం గ్రహించినట్టుగా శ్రీకర్ వెంటనే ఎం చూద్దామని అండి అని కౌంటర్ వేసాడు.

తర్వాత అనిల్ అమ్మాయిలా పుడితే గడ్డాలు మీసాల్లేకుండా ఎలా ఉంటారో చూపించింది. బ్రహ్మముడి శ్రీకర్ గనక అమ్మాయి శ్రీకరిణిలా పుడితే ఎలా ఉంటుందో ఒక పిక్ లో చూపించింది. ఇక సీనియర్ నటుడు అనిల్ ని ఆటపట్టించింది శ్రీముఖి. "అనిల్ గారు మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు" అని అడిగేసరికి 2001 లో వచ్చానని చెప్పాడు. "ప్రేరణా ఆ టైంలో నువ్వు ఎం చేస్తున్నావ్" అని అడిగేసరికి "ఫస్ట్ క్లాస్ చదువుతున్నా" అని చెప్పింది. "2001 లో హమీదా నువ్వు ఎం చేస్తున్నావ్" అని మళ్ళీ అడిగింది శ్రీముఖి. "అప్పుడు ఆయన టీవిలో వచ్చేవారు.

ఆయన్ని చూపించి బూచోడు వచ్చాడు అని చెప్పి నానమ్మ నాకు భోజనం పెట్టేది" అని చెప్పేసరికి అనిల్ ఎక్స్ప్రెషన్ మాములుగా లేదు. తర్వాత అవినాష్ మీరెప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి అని శ్రీముఖిని అడిగేసరికి 2008 లో వచ్చానని చెప్పింది. దాంతో హరి తాను అప్పుడు ఏడవ తరగతి చదువుతున్నాను అని చెప్పాడు. ఇలా ఈ వారం ఈ షో ఎంటర్టైన్ చేయబోతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.