English | Telugu

అబ్బాయిలు ఎవరూ రెడీగా లేకపోయినా అంకుల్స్ ఆలోచించండి

సురేఖావాణి ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకుంది. అలాంటి ఆమె తన కూతురు సుప్రీతను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆమె కూడా అడపాదడపా మూవీస్ అవీ చేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. అలాంటి సుప్రీత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది.

"అబ్బాయిలు ఎవరూ రెడీగా లేకపోయినా కానీ అంకుల్స్ మీరు ఆలోచించండి. మా అమ్మను బాగా చూసుకోవాలి, ఫైనాన్సియల్ పరంగా స్టేబుల్ గా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ని నెగటివ్ గా చూడకూడదు. ఫస్ట్ టాక్సిక్ గా ఉండకూడదు. మా అమ్మను మంచిగా చూసుకునేవాళ్ళు ఐతే నాకు హ్యాపీ. ఎందుకంటే నేను ఒకప్పుడు మా అమ్మకు తెలీకుండా ఒక టాక్సిక్ రిలేషన్ లో ఉన్నాను. అతను ఎలాంటి వాడు అంటే జీన్స్ వేసుకోకూడదు, ఫ్రాక్స్ వేసుకోకూడదు, స్లీవ్ లెస్ వేసుకోకూడదు. నెయిల్స్ పెట్టించుకోకూడదు..అని కండిషన్స్ పెట్టేవాడు . అప్పట్లో పిచ్చితనం, వెర్రితనం, కుర్రతనం కదా అందుకే ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసా. ఇక పెళ్లి విషయం అంటే మా అమ్మకు నచ్చాకే పెళ్లి చేసుకుంటా. లవ్ మ్యారేజ్ ఐనా అరేంజ్డ్ మ్యారేజ్ ఐనా కూడా అమ్మ ఓకే అన్నాకే..పెళ్ళికి ఇంకా బోలెడంత టైం ఉంది. డాడీ చనిపోయిన టైంలో అమ్మను ట్రిప్స్ కి తీసుకెళ్ళేదాన్ని. ఐతే చాలామంది కూడా నాన్న చనిపోయిన బాధ లేకుండా ఎలా తిరుగుతున్నారో, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అంటూ కామెంట్స్ పెడతారు...మేము సంపాదించేవాటిల్లో అస్సలు సేవింగ్స్ చేసుకోకుండా ట్రిప్స్ కి వెళ్ళిపోతూ ఉంటాం. నాకు సోషల్ మీడియా నుంచి ఒక బల్క్ అమౌంట్ వస్తే బయటకు వెళ్ళిపోతాం. మీకు మా వీడియోస్ నచ్చకపోయినా..మా ట్రిప్స్ కానీ మా ఛానల్ నచ్చకపోయినా చూడకండి" అని చెప్పింది సుప్రీతా.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.