English | Telugu

వేలానికి సుడిగాలి సుధీర్.. మ‌రి కొనేది ఎవ‌రు?

మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్వ‌హిస్తున్న జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోల‌లో సుడిగాలి సుధీర్ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. హైప‌ర్ ఆది. ఆటో రాంప్ర‌సాద్ ల‌తో క‌లిసి సుడిగాలి సుధీర్ ఈ రెండు షోల‌లో త‌న‌దైన పంచ్ ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. అయితే గ‌త కొంత కాలంగా `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ` అంటూ మ‌రో కొత్త కామెడీ షోని కూడా ఇదే బ్యాచ్ ఈటీవీలో ప్రారంభించారు. గ‌త కొంత కాలం క్రితం మొద‌లైన ఈ కామెడీ షోకు ఇంద్ర‌జ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోల ల కాకుండాఈ షోని కొంత భిన్నంగా డిజైన్ చేశారు.

హిమ పెళ్లికి సౌంద‌ర్య ప్లాన్‌.. ర‌గిలిపోతున్న‌ స్వ‌ప్న‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొంత కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్నఈ సీరియ‌ల్ ని తాజాగా కొత్త త‌రంతో మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని వారాలుగా గాడి త‌ప్పిన ఈ సీరియ‌ల్ ఇప్పుడిప్పుడే ట్రాక్ లో కి వ‌స్తోంది. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. హిమ మామిడితోట‌లో మామిడి కాయ‌లు కోయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుండ‌గా ఇంత‌లో అక్క‌డికి వ‌చ్చిన నిరుప‌మ్ .. హిమ‌ని ఎత్తుకుని మామిడి కాయ‌లు కోయిస్తాడు. నిరుప‌మ్ చేసిన ప‌నికి హిమ ఆశ్చ‌ర్య‌పోతుంది.