Read more!

English | Telugu

ఐపీఎల్ కామెంటేటర్లు తో స్పై బ్యాచ్...ఎంత ఎదిగిపోయావ్ అంటున్న నెటిజన్స్!

 

బిగ్ బాస్ సీజన్ 7 అన్ని సీజన్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఈ సీజన్ లో ఒక కామన్ మ్యాన్ టైటిల్ విన్ అయ్యాడు. అతనే పల్లవి ప్రశాంత్. ముందుగా అతన్ని మోటివేట్ చేయడమే పని పెట్టుకున్నాడు నటుడు శివాజీ. అలాగే ప్రశాంత్ తో పాటు యావర్ ని కూడా బాగా ఇన్స్పైర్ చేస్తూ అతనికి తెలుగు కూడా నేర్పించేవాడు. తర్వాత వీళ్లంతా కలిసి స్పై బ్యాచ్ గా మారారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినా కూడా స్పై బ్యాచ్ అంటూ వీళ్ళను ఎవరూ వదలడం లేదు. ఇక శివాజీ కూడా స్పై బ్యాచ్ తో ఒక మూవీ కూడా చేస్తాను అని అన్నాడు. మరో వైపు ప్రశాంత్ కూడా కుదిరితే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తాను అని చెప్తున్నాడు.

అలాంటి ఈ టైంలో ఈ స్పై బ్యాచ్ కి మరో అవకాశం వచ్చింది. ఐపిఎల్ క్రికెట్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు షోలో ఇంటర్వ్యూ కోసం ఈ బ్యాచ్ వెళ్ళింది. అలాగే అక్కడ ఉన్న  క్రికెట్ కామెంటేటర్స్ తో పాటు వీళ్ళు కూడా రన్నింగ్ కామెంటరీ చేశారు. ఈ వీడియో మొత్తాన్ని కూడా వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో పోస్ట్ చేసుకున్నారు ప్రశాంత్, శివాజీ. ఇక తిట్టేవాళ్లు ఈ బ్యాచ్ ని తిడుతున్నారు, పొగిడేవాళ్లు ఈ బ్యాచ్ ని పొగుడుతున్నారు. ఏదేమైనా వీళ్ళు ఇంత దూరం ఎదిగారని కూడా విషెస్ చెప్తున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ రెగ్యులర్ డైలాగ్ మళ్ళొస్తే తగ్గేదెలా అంటూ ఐపిఎల్ రన్నింగ్ కామెంట్రీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ టాటా ఐపిఎల్ లో బాటిల్ లో బిగ్ బాస్ సీజన్ 7 స్టార్స్ అమర్ డీప్ చౌదరి, ప్రియాంక జైన్, ప్రశాంత్, యావర్, శివాజీ ఈ ఐదుగురు సందడి చేశారు.