Read more!

English | Telugu

దేవ్, పార్వతీల ముద్దమందారం మళ్ళీ రాబోతుందా?

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ మొదలై సంవత్సరం కూడా పూర్తికాకుండానే ముగిసాయి. అయితే స్టార్ మా టీవీలో ప్రసారమైన కార్తీకదీపంకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో.. జీ తెలుగులో ప్రసారమైన 'ముద్ద మందారం' సీరియల్ కి అంతే ఫ్యాన్ బేస్ ఉంది.

నవంబర్ 17, 2014 లో మొదలైన 'ముద్ద మందారం' సీరియల్ అయిదు సంవత్సరాలు జీ తెలుగు టీవీలో ప్రసారమైంది. 1580 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకున్న ఈ సీరియల్ 2019 డిసెంబరు 27 న ముగిసింది. ఘట్టమనేని కుటుంబాన్ని అఖిలాండేశ్వరి( హరిత జాకీ) చూసుకుంటుంది. తన పెద్ద కొడుకుగా దేవ(పవన్ సాయి), కోడలిగా పార్వతి (తనూజ గౌడ) చేశారు.  పార్వతి మొదటి నుండి ఘట్టమనేని ఇంట్లో పనిమనిషిగా చేసింది. అయితే పార్వతి వ్యక్తిత్వాన్ని చూసి దేవ ఇష్టపడతాడు. కొన్నిరోజులకి ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే అఖిలాండేశ్వరిని ఎదురించి పార్వతిని పెళ్ళి చేసుకుంటాడు దేవ. అలా కొన్ని రోజులకి ఇంటిభాద్యతలని దృష్టిలో ఉంచుకొని పెద్ద కొడుకుని వారి కంపెనీలన్నింటికి మేనేజర్ ని చేస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక దేవ, పార్వతీ చనిపోతారు. అయితే వారి స్థానంలో అచ్చం వారి(దేవ, పార్వతి) పోలికలతోనే మళ్ళీ పునర్జన్మ ఎత్తుతారు. 

సౌందర్యగా పార్వతి, అభిగా దేవ పునర్జన్మ పాత్రలుగా పరిచయమవుతారు. ఇక వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ సరికొత్తగా సాగింది. అలా కొన్ని ఎపిసోడ్ లు సాగిన ఈ సీరియల్ చివరికి పదిహేను వందల ఎనభై ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది‌. అభి, సౌందర్యల వివాహం అవ్వడంతో ఈ సీరియల్ కి శుభం కార్డు పడింది. అయితే ఇప్పుడు ఈ సీరియల్ కి సంబంధించిన యాక్టర్స్ అంతా కలిసి ఓ వ్లాగ్ చేశారు. అది హరిత జాకీ తన వ్లాగ్ లో మెన్షన్ చేసింది. అయితే జీ తెలుగులో కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ' జగదాత్రి' సీరియల్ ప్రోమోలో ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ అఖిలాండేశ్వరి దగ్గరికి గన్ తో మీనన్ అనే రౌడీ ఎంట్రీ ఇస్తాడు. అయితే అఖిలాండేశ్వరి కి ఒక ప్రైవేట్ సైన్యం ఉందంటూ జగద్దాత్రి చెప్తుంటే దేవ ఎంట్రీ ఉంటుంది. ఆ సైన్యం పేరు ఘట్టమనేని దేవేంద్ర అని అఖిలాండేశ్వరి చెప్తుంటే 'ముద్ద మందారం' సీరియల్ అభిమానులకి కన్ఫమ్ గా గూస్ బంప్స్ వస్తాయి‌. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ ప్రోమో కింద అందరు ముద్ద మందారం రెండో పార్ట్ ఎప్పటి నుండి అని కామెంట్లు చేస్తున్నారు. అలాగే హరిత జాకీ వ్లాగ్ కి కూడా వందల్లో‌ కామెంట్లు అందరి నుండి ఒకటే మాట.. ముద్దమందారం సీరియల్ రెండో పార్ట్ ఎప్పుడని? అడుగుతున్నారు. మరి నిజంగానే ముద్దమందారం-2  ఉంటుందా లేక జగద్ధాత్రి సీరియల్ లో అలా గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.