English | Telugu

Krishna Mukunda Murari : మురారిని విడిపించిన ముకుంద.. భవానిని కలిసి ఏం చెప్పిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి' ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -426 లో.. మురారిని పోలీసులు తీసుకొని వెళ్ళడంతో కృష్ణ ఎమోషనల్ అవుతుంది. అసలు ఇదంతా నావల్లే ఎక్కడవాళ్ళు అక్కడుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.. నేనే అనవసరంగా ఆదర్శ్ ని తీసుకొని వద్దామని చెప్పానని కృష్ణ ఏడుస్తుంది.

ఆ తర్వాత మినిస్టర్ కి భవాని ఫోన్ చేసి.. మురారిని విడిపించండి అని రిక్వెస్ట్ చేస్తుంది. నా చేతిలో ఏం లేదు మురారీనే తన చావుకి కారణమని లెటర్ రాసింది. ఇప్పుడు నేను విడిపిస్తే బాగోదు. నా వాళ్ల కాదని చెప్పి మినిస్టర్ ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు మినిస్టర్ పక్కనే శ్రీనివాస్ ఉంటాడు. థాంక్స్ అని మినిస్టర్ కి చెప్తాడు. ఆ తర్వాత ఆదర్శ్ డ్రింక్ చేస్తుంటే.. మధు వెళ్లి ఎవరు ఎంత చెప్పినా సరే నీ ప్రవర్తన మార్చుకోవడం లేదని అడుగుతాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియాడం లేదా అంటు మధు అడుగుతాడు. కానీ ఆదర్శ్ అవన్నీ ఏం పట్టించుకోకుండా మధుని తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ తర్వాత మధు తన ప్రయత్నంగా మురారిని విడిపించడానికి ట్రై చేస్తుంటాడు. ఆ తర్వాత కృష్ణ వాళ్ళ దగ్గరికి కానిస్టేబుల్ వచ్చి ఏసీపీ సర్ గురించి నాకు బాగా తెలుసు.. తన వెనకాల కుట్రలు జరుగుతున్నాయి.. త్వరగా బయటకు తీసుకొని రండి.. లేదంటే లాకప్ డెత్ అయిన జరుగొచ్చని కానిస్టేబుల్ చెప్పి వెళ్తాడు. దాంతో కృష్ణ ఏడుస్తుంది. శ్రీనివాస్ బాబాయ్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తానని కృష్ణ వెళ్తుంది.

ఆ తర్వాత కృష్ణని అరెస్ట్ చేయించావా వెళ్లి మురారిని కలిసి.. కృష్ణని విడిపిస్తానని ముకుంద అనగానే.. కృష్ణని అరెస్ట్ చేయించానని శ్రీనివాస్ అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత కృష్ణ వచ్చి.. ఏసీపీ సర్ ని రిలీజ్ చేయించండని రిక్వెస్ట్ చేస్తుంది. అది ముకుంద చాటు నుండి చూసి అరెస్ట్ చేయించింది కృష్ణని కాదా మురారీనా అని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత నాకేం సంబంధం లేదని కృష్ణని శ్రీనివాస్ పంపిస్తాడు. ఆ తర్వాత మురారి దగ్గరికి ముకుంద వెళ్తుంది. తరువాయి భాగంలో మురారిని ముకుంద విడిపించి భవానితో కలిసి ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.