Read more!

English | Telugu

నేను ఎంఎస్కె ప్రసాద్ గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళం...

ఐపిఎల్ సీజన్ స్టార్ట్ ఐపోయింది. క్రికెట్ లవర్స్ కి పండగే పండగ. ఐతే బిగ్ బాస్ సీజన్ 7 మోటివేటర్ సీనియర్ యాక్టర్ శివాజీ, పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చారు. ఐతే శివాజీ, క్రికెటర్ ఎంఎస్కె ప్రసాద్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం మీకు తెలుసా. వీళ్ళిద్దరూ ఒక స్పోర్ట్స్ ఛానల్ లో కలిసి వాళ్ళ ఫ్రెండ్ షిప్ గురించి చెప్పారు. కామెంటేటర్, యాక్టర్, ఢీ షో హోస్ట్ ఐన నందు వీళ్ళను చిన్నపాటి ఇంటర్వ్యూ చేసాడు.  "నేను ఐపిఎల్ సీజన్ 1 నుంచి ఫాలో అవుతాను.. ఎంఎస్కె నేను గల్లీ క్రికెట్ ఆడేవాళ్ళం..మా వాడు ఢిల్లీ వెళ్ళాడు..మేము గల్లీలోనే ఉండిపోయాం.

మేమిద్దరం బాబాయి, మామ అని పిలుచుకుంటాం.." అని చెప్పాడు శివాజీ. "మనోడికి క్రికెట్ అంటే ఎంతో  ఇష్టం ..మాది పల్నాడు ఏరియా అంటే గురజాల, గుండాలపాడు అన్నమాట.  ఆ లోకల్ ఏరియాస్ లో ఎన్ని మ్యాచ్ లు ఆడేవాళ్ళమో లెక్కేలేదు.." అని చెప్పాడు ఎంఎస్కె ప్రసాద్. "ఊరికే అవ్వరు ఎవరూ పెద్ద పెద్ద క్రికెటర్స్. ఎంఎస్కెని మా ఊరు తీసుకెళ్లి ఆడించేవాళ్ళం. ఏ బాల్ ఐనాసరే  సిక్స్ మాత్రమే కొట్టేవాడు. ప్రతీ బాల్ ని సిక్స్ ఎలా కొడుతున్నాడో తెలిసేది కాదు.  ప్రసాద్ ని ఎలా ఆపాలా అని తెగ తంటాలు పడేవాళ్ళు చుట్టుపక్కల వాళ్లంతా. అలా అప్పట్లో ఆడాడు కాబట్టే ఈరోజు చైర్మన్ ఆఫ్  చీఫ్ సెలెక్టర్ అయ్యాడు. నేను తనను టీవిలో చూస్తున్నప్పుడల్లా చాలా ప్రౌడ్ గా ఉంటుంది. ఎందుకంటే నేను తనతో కలిసి గల్లీల్లో క్రికెట్ ఆడాను కాబట్టి." అని శివాజీ చెప్పాడు. "నేను క్రికెటర్ గా ఎదిగినప్పుడు మా వాడు ఎంత ఎంజాయ్ చేసాడో తాను హీరో ఐనప్పుడు కూడా నేనూ అంతే ఎంజాయ్ చేసాను. మిస్సమ్మ మూవీని ఎవరు మర్చిపోతారు. బ్లాక్ బస్టర్ మూవీ.. ఆ టైంలో అతనే సూపర్ స్టార్. " అని ఎంఎస్కె ప్రసాద్ చెప్పాడు. ఇలా వాళ్ళ ఫ్రెండ్ షిప్ గురించి చాల విషయాలు చెప్పుకొచ్చారు ఇద్దరూ.