Read more!

English | Telugu

వేరే అబ్బాయితో నా గర్ల్ ఫ్రెండ్ ని చూసా.. అందుకే గర్ల్స్ హాస్టల్ లో రాళ్ళు విసిరా

అమరదీప్- సుప్రీతా కలిసి ఒక మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఆ మూవీకి బాడ్ బాయ్ అనే పేరు మొదట అనుకున్నారు కానీ దానికి ఇంక అసలు వేరే టైటిల్ కోసం వెతుకుతున్నారు. ఆ టైటిల్ రిలీజ్ కూడా త్వరలోనే ఉండబోతోంది. ఐతే ఈ ఇద్దరూ కలిసి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వచ్చారు. అందులో అమర్ దీప్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

"బెంగుళూరు గర్ల్స్ హాస్టల్ లో రాళ్లు ఎందుకు విసిరేసావ్ అసలు.." అని హోస్ట్ అడిగేసరికి " నేను ఇష్టపడిన ఒక అమ్మాయిని చూడకూడని పరిస్థితిలో చూసాను. ఈ అబ్బాయి వెళ్లి తనను హగ్ చేసుకున్నాడు. అది చూసి నేను చాలా ఫీలయ్యాను. అప్పుడు నన్ను చూసిన ఆ అమ్మాయి భయపడి వెళ్లి హాస్టల్ లో దాక్కుంది.. నేను కోపంతో బయటకు రా  మాట్లాడుకుందాం అని పిలిచాను కానీ రాలేదు.. ఫోన్ చేసాను..స్విచాఫ్ చేసింది. అప్పుడు నోకియా ఫోన్స్ కదా. టక్కున ఆఫ్ చేసేయొచ్చు. సెల్ ఆఫ్ చేస్తావా అని సెల్ విసిరేసా అది తీసుకుని లోపలి వెళ్ళిపోయింది. ఎన్ని సార్లు పిలుస్తున్నా రాకపోయేసరికి రాళ్లు విసిరేసాను. ఇవన్నీ పాత కథలబ్బా 2007 - 08  టైంలోవి. ఇప్పుడున్న కథలో నేను, నా సినిమా, నా ఫామిలీ, నా కుక్క అంతే...ఐతే నేను జస్ట్ మిస్ అని ఒక వెబ్ సిరీస్ చేశా. అందులో 24 లిప్ లాక్స్ ఉంటాయి. అది అసలు రిలీజ్ కాలేదు ఎప్పుడవుతుందో కూడా తెలీదు. నాకు నా కో-స్టార్స్ మీద ఎప్పుడూ క్రష్ లేదు. ప్రియాంక గారు కానీ మెరీనా గారు కానీ మంచి ఫ్రెండ్స్ ...వాళ్లకు ఆల్రెడీ బాయ్-ఫ్రెండ్స్ ఉన్నారు. ఐతే ఇండస్ట్రీలో ఒక పెద్దాయన నాకు చెప్పారు ప్రేమాదోమా లాంటి  పత్తేపారం పెట్టుకోవద్దని దాంతో నాకు ఇండస్ట్రీలో ఎవరి మీద ఇలాంటి అభిప్రాయలు కానీ క్రష్ లు కానీ  అసలు లేవు. " అని చెప్పాడు అమర్ దీప్.