Read more!

English | Telugu

Brahmamudi : రాజ్ చేసిన పనికి ఆ బాబుకెందుకు శిక్ష.. తప్పు చేసిన భర్తకు సపోర్ట్ గా భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -365 లో...కావ్య దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది. రాజ్ ఏ తప్పు చెయ్యలేదని కావ్య నమ్ముతుంది. ఫ్యామిలీ కోసం ఇష్టం లేని నన్ను భార్యగా ఒప్పుకున్నాడు.. ఇప్పుడు ఫ్యామిలీని కాదని ఇలా చేసాడంటే నమ్మలేనని కావ్య అంటుంది. అది అబద్ధమని చెప్పడానికి కూడా రుజువు లేదని ఇంత జరిగిన వాడిని నువ్వు ఎలా నమ్ముతున్నావో అర్థం కావడం లేదని ఇందిరాదేవి అంటుంది. అంత గొడవ చేసి నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోలేను.. అసలు ప్రయత్నం చెయ్యకుండా నా కాపురాన్ని ఎలా వదులుకోవాలని ఇందిరాదేవితో కావ్య అంటుంది.

ఆ తర్వాత రాజ్ తీసుకొచ్చిన బాబు తనని ఇబ్బంది పెడుతుంటాడు. మరొకవైపు రాజ్ ఇలా చేసాడంటే నేను నమ్మలేకపోతున్నానని అపర్ణ అంటుంది. నా దగ్గర ఇంత పెద్ద నిజం దాచాడు. నా నమ్మకాన్ని వమ్ము చేసాడని సుభాష్ తో అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత కావ్య గదిలోకి వచ్చేసరికి.. రాజ్ బాబుని పడుకోపెట్టి తను పడుకుంటాడు. కాసేపటికి బాబు టాయిలెట్ చేస్తే.. అయ్యో ఇప్పుడేం చేయాలని రాజ్ అనుకుంటాడు. బాబుని తీసుకొని వచ్చేటప్పుడు ఇలాంటివి ఉంటాయని తెలియదా అని కావ్య అంటుంది. మరుసటి రోజు ఉదయం కావ్య కిచెన్ లో వర్క్ చేసుకుంటుంటే.. అసలేం జరగనట్టు కావ్య వర్క్ చేసుకుంటుందని అనామిక, ధాన్యలక్ష్మిలు అనుకుంటారు. బాబు ఏడుస్తుంటే రాజ్ కిందకి తీసుకొని వస్తాడు. బాబుని వాళ్ల అమ్మ దగ్గర వదిలేసిరా అని అపర్ణ చెప్పగానే.. అది జరగదంటు అపర్ణకు రాజ్ ఎదరుమాట్లాడుతడు. ఇక అలా అయితే నువ్వు తీసుకొని వచ్చిన బాబు, నువ్వు అతిధిలాగే ఉండాలి. ఎవరు వాళ్ళకి సాయం చేయడానికి వీలు లేదు. ఇది నా నిర్ణయమని అపర్ణ చెప్తుంది.

ఆ తర్వాత బాబు కోసం పాలు వేడి చేస్తూ రాజ్ ఇబ్బంది పడుతుంటే.. నేను తీసుకొని వస్తానని కావ్య అంటుంది. బాబుకి కావ్య పాలు తీసుకొని వెళ్తుంటే రుద్రాణి వాళ్ళు చూసి.. ఇందాకే వదిన అలాంటివి చెయ్యొద్దని చెప్పింది కదా అని అంటుంది. మీకు సమాధానం చెప్పనవసరం లేదని కావ్య అంటుంది. అప్పుడే వచ్చి‌న అపర్ణ.. నాకు చెప్పాలంటు వస్తుంది. మీ కొడుకు తప్పు చేస్తే.. పాపం ఆ బాబుకి ఎందుకు శిక్ష అని కావ్య అంటుంది. తరువాయి భాగంలో.. బాబుకి కావ్య పాలు తీసుకోని వెళ్లి ఇస్తుంది. ఆ తర్వాత కావ్య ఇచ్చిన విడాకుల పత్రాలపై రాజ్ సంతకం చేస్తాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.