English | Telugu
పలు రాష్ట్రాల్లో విపక్ష పార్టీల నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వాలను విచ్చిన్నం చేస్తున్న బీజేపీకి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఊహించని షాక్ తగిలింది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ).. సీఎం బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది.
నాయకుడి మాటలు, చేతలు పది మంది ఆచరించేలా ఉండాలి.. పది మంది ఛీ కొట్టేలా కాదు. కానీ, ఏపీలో కొందరు రాజకీయ నాయకుల తీరు మాత్రం ఛీ కొట్టేలా ఉంది. వీళ్ళా మన నాయకులు అని సిగ్గుతో తలదించుకునేలా ఉంది.
ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను ప్రధానికి వివరించారు.
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ తీవ్ర జ్వరం, ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటంతో ఆయనకు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
నిన్న శాసన మండలిలో బిల్లుల ఆమోదం విషయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా వైసిపి మంత్రులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, అశోక్ బాబు ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ తీవ్రత ను కట్టడి చేసే విషయంలో తీసుకుంటున్న చర్యలను హైకోర్టు తరచూ తప్పు పడుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రభుత్వం ప్రతి రోజు చేస్తున్న కరోనా పరీక్షల సంఖ్య పైన కోర్టు సీరియస్ గా స్పందిస్తోంది.
2019 ఎన్నికల సమయం లో అగ్రిగోల్డ్ బాధితులతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి బడ్జెట్లో రూ. 1150 కోట్లు కేటాయించి అందరికీ పంపిణీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
మన దేశంలో కరోనా కేసులు సంఖ్య దాదాపుగా మూడున్నర లక్షలకు చేరుకొంది. ఈ మొత్తం కేసులలో సగం పైగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి నమోదయ్యాయి.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 14 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.
భారత్, చైనా సరిహద్దు ఘర్షణపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. చైనా సైన్యం భారత భూభాగాన్ని ఎలా ఆక్రమించిందో ప్రధాని మోడీ వెల్లడించాలని సోనియా డిమాండ్ చేశారు.
కరోనా దెబ్బకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలలో, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లలో కోత విధించిన విషయం తెలిసిందే. ఐతే కొంత మంది పెన్షనర్లు తమ పెన్షన్లలో కోతకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో పలు బిల్లులు శాసన సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుతో పాటుగా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది.
టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆపరేషన్ గాయం తిరగబెట్టడంతో, ఆయనకు మరోసారి ఆపరేషన్ చేశారని తెలుస్తోంది. అరెస్టుకు ముందు రోజే ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆ స్థితిలో అరెస్టు చేసి.. రోజంతా ఆయనను వాహనంలో తిప్పారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం నరకం చూపిస్తోందన్నారు.
ఏపీలో గత 24 గంటల్లో 15,188 శాంపిల్స్‌ను పరీక్షించగా 275 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఇద్దరు మరణించారు.