English | Telugu

అచ్చెన్నాయుడుకు మరోసారి ఆపరేషన్ చేసిన వైద్యులు!

టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆపరేషన్‌ గాయం తిరగబెట్టడంతో, ఆయనకు మరోసారి ఆపరేషన్ చేశారని తెలుస్తోంది. అరెస్టుకు ముందు రోజే ఆయనకు ఆపరేషన్‌ జరిగింది. ఆ స్థితిలో అరెస్టు చేసి.. రోజంతా ఆయనను వాహనంలో తిప్పారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనను గంటల పాటు వాహనంలో తిప్పడంతో గాయం మానలేదు. రక్తస్రావం ఆగకపోవడంతో, అచ్చెన్నాయుడుకు మళ్లీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఉన్నతాధికారుల అనుమతితో ఈరోజు మరోసారి ఆపరేషన్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.