English | Telugu
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం ఏపీ ప్రభుత్వంతో జీఎంఆర్ ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందానికి సంబంధించి జీవో కూడా విడుదలైంది.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలపర్రు చెక్ పోస్ట్ వద్ద టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ధర్నా చేసేందుకు చింతమనేని ప్రభాకర్ ప్రయత్నించారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి హెల్త్ బులెటిన్ విడుదలైంది. అచ్చెన్నాయుడు సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఇటీవల జరిగిన ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని నిన్న ఎసిబి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు ఎసిబి కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం కూడా తెలిసిందే. ఐతే ఈ మొత్తం వ్యవహారం పై రాజకీయ విశ్లేషకుల స్పందన మాత్రం వేరుగా ఉంది.
టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిల అరెస్ట్‌ను నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన లోకేష్.. ప్రతిపక్ష నేతల పై కక్ష తీర్చుకోవడానికే జగన్ సీఎం అయినట్టు ఉందని మండిపడ్డారు.
తెలంగాణాలో కరోనా వ్యాప్తి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా జనగామ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
భారత్‌లో రోజుకి 9 వేలు, 10 వేలు నమోదవుతున్న కరోనా కేసులు ఇప్పుడు 11 వేల మార్క్ ను కూడా దాటాయి. గత 24 గంటల్లో దేశంలో 11,458 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
ఏపీలో నిన్న టీడీపీ నేత అచ్చన్నాయుడి అరెస్ట్ మరువక ముందే.. నేడు మరో ఇద్దరు టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
టీడీపీ సీనియర్ నేత, తన బాబాయి అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. అచ్చెన్నాయుడిని 151 మంది ఎమ్మెల్యేలు ఎదుర్కోలేక ఈ రకమైన చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం ఏపీ ప్రభుత్వంతో జీఎంఆర్ ఒప్పందం కుదర్చుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ప్రభుత్వం తరఫున అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ రోజు ఇఎస్ఐ గోల్ మాల్ వ్యవహారం లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయంలో గతంలో కార్మిక శాఖా మంత్రిగా పని చేసిన పితానిని కూడా అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు.
కరోనా రోగుల పట్ల జంతువుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఢిల్లీ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా రోగులకు చికిత్స, వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.