భూమా అఖిలప్రియ సోదరుడిపై కేసు నమోదు
టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని పడకండ్ల గ్రామంలో పొలం దారి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.